Pushpa 2: పుష్ప 2 సినిమా అదిరిపోయే క్లైమాక్స్ ఇదే..!

పుష్ప 2 సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ .. డైరెక్టర్ సుకుమార్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి .

New Update
Pushpa 2: పుష్ప 2 సినిమా అదిరిపోయే క్లైమాక్స్ ఇదే..!

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ఇండియా(Pan India) స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన మూడో సినిమా 'పుష్ప'. బన్నీ కెరియర్ లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా(Blockbuster) నిలిచింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. జాతీయ అవార్డు పొందిన మొదటి హీరోగా బన్నీ నిలిచాడు. దాంతో పాటు ఐకాన్ స్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో బన్నీ మైనపు విగ్రహానికి చోటు దక్కింది. తెలుగు హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఆ గౌరవం ఐకాన్ స్టార్ కే సొంతమైంది.

డైరెక్టర్(Director)  సుకుమార్ పుష్ప(Pushpa) సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనము స్మగ్లర్ పాత్రలో కనిపించిన బన్నీ తన మ్యానరిజం, మాట్లాడే యాస ఆడియన్స్ లో సినిమాకు మంచి క్రేజ్ తెచ్చింది. సుకుమార్ తో చేసిన మూడు సినిమాలు బన్నీ కెరియర్ లో మంచి విజయాలుగా నిలిచాయి. ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 కూడా పెద్ద హిట్ అవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

పుష్ప 2 సినిమాను దర్శకుడు సుకుమార్ మరింత ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో బన్నీకి సంబందించిన పోస్టర్(Poster) సోషల్ మీడియాలో బాగా వైరలైంది ఆ పోస్టర్ లో బన్నీ కొత్త లుక్ లో చాలా ఆసక్తికరంగా కనిపించాడు. బన్నీ అభిమానులు పుష్ప 2 కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

అయితే పుష్ప 2 సినిమాలో(cinema) డైరెక్టర్ సుకుమార్ పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారని.. స్మగ్లింగ్ చేస్తుండగా ఎదురుకాల్పుల్లో బన్నీ చనిపోతాడని నెట్టింట్లో వార్త వైరలవుతుంది. ఈ వార్త బన్నీ అభిమానులకు పెద్ద షాకిచ్చింది. పుష్ప 2 లో పుష్ప రాజ్ పాత్ర ముగుస్తుందని.. ఇంకో పాత్రలో బన్నీ డిఫెరెంట్ లుక్ కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Singer Mangli Marriage: పెళ్లి పై మంగ్లీ క్లారిటీ.. మంగ్లీ సమాధానం వింటే షాక్..!

Advertisment
తాజా కథనాలు