Pushpa 2 : ఎంతకు తెగించార్రా!.. 'పుష్ప 2' కపుల్ సాంగ్ పై ఈ ఫన్నీ ట్రోల్ చూస్తే పడి పడి నవ్వుతారు!

సోషల్ మీడియాలో 'బటర్ ఫ్లై, బటర్ ఫ్లై' అంటూ వచ్చిన ఫన్నీ సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా రిలీజైన 'పుష్ప 2' కపుల్ సాంగ్ లోని బన్నీ, రష్మిక వేసిన స్టెప్స్ ని బటర్ ఫ్లై బటర్ ఫ్లై సాంగ్ తో ఎడిట్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

New Update
Pushpa 2 : ఎంతకు తెగించార్రా!.. 'పుష్ప 2' కపుల్ సాంగ్ పై ఈ ఫన్నీ ట్రోల్ చూస్తే పడి పడి నవ్వుతారు!

'Pushpa 2' The Couple Song Funny Troll : ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల నుంచి రిలీజ్ అవుతున్న పాటలకు ట్రోలింగ్స్ తప్పడం లేదు. ఓ పాట రిలీజైతే అందులో మ్యూజిక్ ఎక్కడో విన్నట్లు ఉందని, కాపీ ట్యూన్ అని, సాంగ్ లో హీరో, హీరోయిన్ వేసే స్టెప్స్ ని మ్యాచ్ చేస్తూ వేరే సాంగ్ తో ఎడిట్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా థమన్ కంపోజ్ చేసే సాంగ్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతుంటాయి. అయితే తాజాగా పుష్ప 2 లో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన కపుల్ సాంగ్ ని మీమర్స్ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫన్నీ ట్రోల్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

పడి పడి నవ్వుతారు..

సోషల్ మీడియాలో రీసెంట్ గా 'బటర్ ఫ్లై, బటర్ ఫ్లై' అంటూ వచ్చిన ఓ ఫన్నీ సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అయితే తాజాగా రిలీజైన పుష్ప 2 కపుల్ సాంగ్ లోని బన్నీ, రష్మిక వేసిన స్టెప్స్ ని బటర్ ఫ్లై బటర్ ఫ్లై సాంగ్ తో ఎడిట్ చేశారు. ఈ సాంగ్ కి బన్నీ, రష్మిక డ్యాన్స్ కి సరిగ్గా మ్యాచ్ అయింది.

దీంతో ఈ వీడియోని ఓ మీమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే ఎంతకు తెగించార్రా!, ఎవర్రా మీరంతా, అలా ఎలా ఎడిట్ చేశార్రా, ఇదేం ఎడిటింగ్ రా బాబు అంటూ అంతే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు