pushpa 2 craze: పుష్పను చూసి వెనక్కు తగ్గిన సింగం..!

మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్, పుష్ప ది రూల్ విడుదల తేదీ ప్రకటన భారతీయ చలనచిత్ర వర్గాల్లో భారీ అలజడికి దారితీసింది. పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది పంద్రాగస్ట్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఏ భారతీయ సినిమాకైనా ఈ తేదీ బెస్ట్ రిలీజ్ డేట్. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ పండగ చేసుకుంటోంది. అయితే, అజయ్ దేవగన్ కు మాత్రం ఇది షాకిచ్చింది.

pushpa 2 craze: పుష్పను చూసి వెనక్కు తగ్గిన సింగం..!
New Update

pushpa 2 craze: మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్, పుష్ప ది రూల్ విడుదల తేదీ ప్రకటన భారతీయ చలనచిత్ర వర్గాల్లో భారీ అలజడికి దారితీసింది. పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది పంద్రాగస్ట్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఏ భారతీయ సినిమాకైనా ఈ తేదీ బెస్ట్ రిలీజ్ డేట్. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ పండగ చేసుకుంటోంది. అయితే, అజయ్ దేవగన్ కు మాత్రం ఇది షాకిచ్చింది.

తన కొత్త సినిమా విడుదలను అజయ్ దేవగన్ ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింఘం ఫ్రాంచైజీ చేస్తున్నాడు దేవగన్. 2024, ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తామని చాలా కాలం కిందటే ప్రకటించారు. కానీ ఉరుములేని పిడుగులా పుష్ప-2 ఆ తేదీకి వచ్చింది.

పుష్ప-2పై అంచనాలు మామూలుగా లేవు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఉత్తరాది జనం కళ్లుకాయలు కాచేలా చూస్తున్నారు. ఇలాంటి సినిమాకు పోటీగా అజయ్ దేవగన్ వెళ్లలేడు. వెళ్తే, అది దుస్సాహసం అవుతుందనే విషయం అతడికి తెలుసు. అందుకే తన కొత్త సినిమా కోసం, మరో కొత్త తేదీని వెదుక్కునే పనిలో పడ్డాడు అజయ్ దేవగన్.

దర్శకుడు రోహిత్ శెట్టి తీస్తున్న సింగం-ఎగైన్ అనే సినిమా ఈ ఫ్రాంచైజీలో తాజా చిత్రం. సింఘం ఎగైన్‌లో కరీనా కపూర్, దీపికా పదుకొణె హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్ బాజీరావ్ సింగం పాత్రను తిరిగి పోషించాడు. నివేదిత, టైగర్ ష్రాఫ్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లు ప్రత్యేక అతిధి పాత్రలు పోషించారు.

ఇంత సెటప్ ఉన్నప్పటికీ పుష్ప-2కు పోటీగా సింగం ఎగైన్ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ భయపడుతున్నారు. అందుకే ఆగస్ట్ 15 నుంచి సినిమాను తప్పిం, అక్టోబర్ కు వాయిదా వేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడీ న్యూస్ బన్నీ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe