Purandeswari: విజయవాడలోని కొండపల్లిలో శాంతినగర్ - కవులూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!
వైసీపీ నేతలు ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో కూడా వారు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు బుడమేరుకు గండి పడిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు రూ. 400 కోట్లతో బుడమేరు పటిష్టతకు పనులు చేపట్టారని.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
Also Read: ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలకలం.. హైదరాబాద్‌లో మత్తు దందా గుట్టురట్టు..!
బుడమేరు పనులను జగన్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇంత విపత్తు సంభవించేది కాదని..ప్రజలు ఇలా ఇబ్బంది పడేవారు కాదని అన్నారు. వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటకడుతున్నారని వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఎంత నష్టం వాటిల్లిందో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి సాయం అందిస్తుందని చెప్పారు.