BJP-Janasena: జనసేన మా మిత్ర పక్షమే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు!

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. జనసేన తమ మిత్రపక్షమే అని పురందేశ్వరి అన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

New Update
AP: రాష్ట్రంలో బీజేపీ ఫోకస్ ఇదే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..!

AP BJP Chief Purandeswari: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో (Daggubati Purandeswari) జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ (Nadendla Manohar) భేటీ ఈ రోజు భేటీ అయ్యారు. పొత్తులపై పురందేశ్వరితో నాదేండ్ల చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పొత్తులపై త్వరగా తేల్చే యోచనలో జనసేన (Janasena) ఉంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ నెలఖారుకు పొత్తులపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!

ఏపీ చీఫ్ పురందేశ్వరి కామెంట్స్...

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్ ఈ రోజు బీజేపీ చీఫ్ పురందేశ్వరి తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన తమ మిత్ర పక్షమే అని మరోసారి స్పష్టం చేశారు. నాదెండ్ల తో భేటీ మర్యాద పూర్వకమే అని అన్నారు. శివప్రకాష్ జీ ని కలవడానికే మనోహర్ వచ్చినట్లు తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై ఆమె స్పందించారు.

షర్మిల ఏ పార్టీ లో చేరితే తమకెందుకు అని అన్నారు. మా పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాం అని అన్నారు. పొత్తు లతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పొత్తు ల పై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తు ల పై అంతిమ నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని తేల్చి చెప్పారు.

ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ భేటీ..

ఇవాళ ఏపీ బీజేపీ (AP BJP) కోర్‌ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశానికి ఏపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ హాజరయ్యారు. కోర్‌ కమిటీ సమావేశంలో పొత్తులపై చర్చ జరిగిందని సమాచారం. సమావేశం ముగియగానే పురందేశ్వరితో జనసేన నేత నాదేండ్ల మనోహర్ సమావేశం కావడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో (NDA) భాగస్వామిగా జనసేన ఉన్న విషయం తెలిసిందే. కానీ, టీడీపీ మాత్రం ఎన్డీయేలో లేదు. అయితే టీడీపీ కూడా ఎన్డీయేలో త్వరలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ కూడా చేస్తాయనే వార్తలు కూడా వెల్లువడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడ రాలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు