BJP Purandeswari: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బైజయంత్ పాండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
Also Read: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు మొట్టికాయలు..
అయితే, ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమావేశానికి పురందేశ్వరి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి..రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నివాసానికి పురందేశ్వరి రాకపోవడంపై బీజేపీ నేతలు సైతం స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: ముక్కూటమి కుదిరింది.. జనసేనానికి త్యాగమే మిగిలిందా?
కేంద్రమంత్రి, కేంద్రస్థాయి నేతలు వచ్చినపుడు ప్రోటోకాల్‌లో భాగంగా వెంట ఉండాల్సిన పురందేశ్వరి ఎందుకు రాలేదు? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ- బీజేపీ పొత్తు కోసం గట్టిగా ప్రయత్నించిన పురందేశ్వరి..తీరా పొత్తు కుదిరిన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారని సందేహం కలుగుతోంది. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో అసలు ఏం జరుగుతోంది? పురందేశ్వరి ఎందుకు రాలేదు? కావాలనే రాలేదా? లేదంటే ఏ విషయంలోనైనా అలిగి రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.