Crime: రెండంతస్తుల భవనం కూలి.. ఐదుగురి మృతి!

పంజాబ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. రూప్‌నగర్‌లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్‌ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు.

New Update
Crime: రెండంతస్తుల భవనం కూలి.. ఐదుగురి మృతి!

Punjab; పంజాబ్‌(Punjab)లో ఘోర ప్రమాదం (Accident)  జరిగింది. రూప్‌నగర్‌లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్‌ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఐటీబీపీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాలను తొలగించే పనుల్లో ఉన్నారు. రూపనగర్ డీసీ ప్రీతి యాదవ్ మాట్లాడుతూ.. లాంటర్ కింద ఐదుగురు కూలీలు చనిపోయినట్లు తమకు సమాచారం వచ్చిందని వివరించారు. ప్రజల భద్రత ముఖ్యమని.. అందువల్ల సాంకేతిక నిపుణులు సహాయ చర్యలు చేపట్టారని తెలిపారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ కూడా భయపడనవసరం లేదని.. రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరించాలని అధికారులు కోరారు.

Also read: నేడు లోక్‌ సభ ఎన్నికల తొలి విడతలో 102 స్థానాలకు పోలింగ్‌..2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌!

Advertisment
తాజా కథనాలు