Chandigarh: పంజాబ్ సీఎం భగవంత్ కు కుమార్తె పుట్టింది!

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కూతురు జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. దీంతో పలువురు రాజకీయనాయకులు, ఆప్ కార్యకర్తలు, సెలబ్రీటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియాజేశారు.

New Update
Chandigarh: పంజాబ్ సీఎం భగవంత్ కు కుమార్తె పుట్టింది!

Punjab CM Bhagwant Mann: పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌కు కూతురు పుట్టిందని సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కుమార్తె జన్మించింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భగవంత్ మాన్ ట్వీట్ చేస్తూ, 'దేవుడు నాకు కుమార్తెను ప్రసాదించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. బుధవారం రాత్రి సీఎం మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఆస్పత్రిలో చేరారు. మార్చి నెలలో నా ఇంట్లో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది' అని ట్వీట్ చేశాడు. ఇంటికి కొత్త అతిథి వస్తున్నాడు అని పేర్కొన్నారు.


డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో సీఎం భగవంత్ మాన్  7 జూలై 2022న వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాన్నిఎటుంటి హంగులు లేకుండా  చాలా సింపుల్‌గా నిర్వహించారు.  ఇందులో ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, పార్టీకి చెందిన పలువురు పాల్గొన్నారు. సీఎం మన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ హర్యానాలోని కురుక్షేత్రలోని పెహోవా నివాసి.

భగవంత్ మాన్ తన కుమార్తె పుట్టిన వార్తను పంచుకోవడంతో, సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక వ్యక్తులతో పాటు సామాన్యులు కూడా సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి రెండవ వివాహం డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో, అతనికి అతని మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: కేజ్రీవాల్‌కు ఊరట..జైలు నుంచి పరిపాలన చేయోచ్చు అని చెప్పిన ఢిల్లీ హైకోర్టు

Advertisment
తాజా కథనాలు