ఒకే ఒక్క క్లిక్.. కట్ చేస్తే రూ. 17 లక్షల ఫసక్.. అసలేమైందంటే..

పుణేలో ఓ టెకీని దారుణంగా మోసం చేశారు సైబర్ చీటర్స్. యాడ్స్ ద్వారా ఇన్‌కమ్ సంపాదించొచ్చు అని చెప్పి ఏకంగా రూ. 17 లక్షలు కొట్టేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్  క్లిక్ చేశారో అంతే సంగతులు..!!
New Update

17 Lakhs Online Cheating: ప్రస్తుత కాలం అంతా టెక్నాలజీదే హవా. ప్రతి పనికి టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటున్నారు జనాలు. అయితే, దినదినాభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాగళ్లు టెక్నాలజీని ఉపయోగించుకుని.. ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వాలు, భద్రతా వ్యవస్థలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ స్కామ్‌లు భారీగా పెరిగిపోతున్నాయి.

తాజాగా మహారాష్ట్రలోని పుణేకి చెందిన టెకీ(34) ఆన్‌లైన్‌లో సంపాదించాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను ఏకంగా రూ. 17 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధిత వ్యక్తి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా.. వీడియోలను లైక్ చేస్తూ పార్ట్‌టైమ్ జామ్ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు అనే యాడ్ కంట పడింది.

దాంతో.. ఆ యాడ్‌ను క్లిక్ చేసిన టెకీ.. డిసెంబ‌ర్ 1 నుంచి 6 తేదీల మధ్య వారు ఇచ్చిన టాస్క్‌లను కంప్లీట్ చేశాడు. ఇందుకు ప్రతిఫలంగా మొదట్లో కొంత డబ్బు చెల్లించారు కేటుగాళ్లు. అయితే, మిగతా మొత్తం చెల్లించాలంటే.. డిపాజిట్ చేయాలని పలుమార్లు ఇతనిచే డబ్బులు కట్టించుకున్నారు. మొత్తంగా ఇతను రూ. 17 లక్షలు కట్టాడు. ఆ తరువాత అటువైపు నుంచి ఎలాంటి రెస్పాండ్స్ రాకపోవడంతో.. తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!

ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు!

#cyber-crime #cyber-fraud #online-cheating
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe