రేపు హైదరాబాద్‌లో పార్కులు బంద్.. ఇదే కారణం! నగరంలో ఒక్కరోజు పార్కులు మూసిఉండనున్నాయి. ఎందుకంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని కార్యక్రమం జరుగనున్నది. By Vijaya Nimma 21 Jun 2023 in లైఫ్ స్టైల్ తెలంగాణ New Update షేర్ చేయండి సీఎం కేసీఆర్ రేపు హైదరాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఈనెల 22న పార్కులు మూసిఉండనున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్‌ఎండీఏ సెలవు ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు బీపీపీ పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను మూసివేయనున్నట్లు చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి