AP: మాకు డి పట్టాలు ఇవ్వండి.. మన్యం జిల్లాలో గిరిజనుల ఆందోళన..! కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని మన్యం జిల్లా సితంపేట గ్రామ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న తమకు డి పట్టాలు కాకుండా కొండ పోడు పట్టాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Vizianagaram: కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని మన్యం జిల్లా సితంపేట గ్రామ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న డి పట్టా భూములకు కొండ పోడు పట్టాలిచ్చారని సీతంపేట గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి రెండు సార్లు వరి పండించే భూములకు కొండపోడు పట్టాలి ఇచ్చి దుక్కు దున్నొద్దని, పంటలు పండించొద్దని ఫారెస్ట్ అధికారులు భయపెడుతున్నారని సీతంపేట గిరిజనులు వాపోతున్నారు. Also read: ఆ రోజే అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి నారాయణ పోడు పట్టాలు ఇవ్వడం వలన తమకు ఏవిధమైన ప్రభుత్వ రాయితీలు రావడం లేదని, బ్యాంక్ రుణాలు ఇవ్వడం లేదని, అన్యాయానికి గురవుతున్నామని గిరిజనులు బాధపడుతున్నారు. పక్కనే ఉన్న భూములకు జిరాయితీగా పట్టాలు ఇచ్చి తమకు మాత్రం కొండపోడు పట్టాలు ఇవ్వటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సర్వే చేసి తాము సాగు చేసుకుంటున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని అధికారుల్ని వేడుకుంటున్నారు సీతంపేట గిరిజనులు. Also Read: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..! ఐటీడీఏ పీవో, కలెక్టర్ స్పందించి పోడు పట్టాలు రద్దు చేసి సాగు చేసుకుంటున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డి పట్టా వస్తే 1బి, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు తాము పొంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటామని ఆశభావం వ్యక్తం చేశారు. #vizianagarm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి