Tirupati: రోడెక్కిన వ్యవసాయ కళాశాల ఉద్యోగులు..

తిరుపతిలో రోడ్లపై బైఠాయించి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యవసాయ కళాశాల ఉద్యోగులు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్పందించకుంటే తమ ఆందోళన కార్యక్రమంను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

New Update
Tirupati: రోడెక్కిన వ్యవసాయ కళాశాల ఉద్యోగులు..

Tirupati: తిరుపతి జిల్లాలో రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు వ్యవసాయ కళాశాల ఉద్యోగులు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో వ్యవసాయ కళాశాల ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: బాలకృష్ణ డైలాగులు చెప్పకు.. చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్..!

ప్రభుత్వ స్పందించకుంటే తమ ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. బేసిక్ పే, డీఏ, హెచ్ ఆర్ ఏ, సీ సీ ఎతో కూడిన టైం స్కెల్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఆచార్య యన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రిసెర్చ్ స్టేషన్ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు లేబర్ వివరాలను రిసెర్చ్ స్టేషన్లలో నమోదు చేయాలని కోరారు. పనిచేస్తున్న కాంట్రాక్టు లేబర్ ను ఓటౌసోర్సింగ్ కార్పొరేషన్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

Also Read: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..!

పాదయాత్రలో సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కాగా, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రోజుకో ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు