మసాజ్ ముసుగులో వ్యభిచారం మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని కార్వీ ఎదురుగా ఓ అపార్ట్‌మెంట్‌లో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్–హక్ కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. By Vijaya Nimma 27 Jun 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి మరోసారి బయటపడిన బాగోతం వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శృతి, రమణ, జాహెద్ ఉల్ హక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. యువతులను రెస్క్యూహోంకు తరలించారు. 18 మంది విటులను కోర్టులో హాజరుపరిచారు. ఓస్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసి.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి శృతి చదువుల్లో రాణించింది. డాక్టర్ కావాలనుకొని ఉక్రెయిన్‌లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో ఏడాది ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలం వచ్చేసింది. అనంతరం అమీర్‌పేట్‌లోని ఓ శిక్షణ కేంద్రంలో ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ కూడా తీసుకుంది. అదే సమయంలో బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గానూ పని చేసింది. ఆ సమయంలోనే అయిదు నక్షత్రాల హోటల్ తళుకుబెళుకులను కళ్లారా చూసింది. జైల్ నుంచి వచ్చి..మళ్లీ అదే దారిలో.. స్టార్ హోటల్ లైఫ్‌కు పూర్తిగా అలవాటు పడింది. డాక్టర్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా కలలు కని అవి సాకారం కాకపోవడంతో.. తేలికగా డబ్బు సంపాదించే మరో మార్గంలో వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గతేడాది పంజగుట్ట పీఎస్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించింది. కాగా.. కొద్ది రోజుల్లోనే పంజగుట్ట పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. స్పా సెంటర్ నిర్వహణలో మెలకువలు తెలుసుకున్న సదరు యువతి జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ అదే దారి పట్టింది. గతంలోనూ ఓ కేసు ఈసారి బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్ తెరిచింది. కొద్ది రోజుల్లోనే ఆమె మసాజ్ సెంటర్ వ్యాపారం వృద్ధి చెందింది. పోలీసులు మరోసారి స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించారు. రెండోసారి ఆమె బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడి.. తాజాగా జైలుకు శృతి వెళ్లింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి