GN Saibaba: జీ.ఎన్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ఫ్రొఫెసర్.. పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల వల్ల 9 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు. అదికూడా దేశంలోనే అత్యంత కఠినమైన అండాసెల్ జైలులో. కానీ చివరికి సుప్రీంకోర్టు సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేసింది. ఇంతకు సాయిబాబా అరెస్ట్ వెనకల ఏం జరిగింది? జైలునుంచి ఇటీవల విడుదలైన సాయిబాబా ఏం చేయబోతున్నారు? నిజంగానే ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు పార్టీలతో సంబంధాలున్నాయా? సాయిబాబా అతని సతీమణి వసంత కుమారితో RTV సెన్సేషనల్ ఇంటర్వ్యూ.
సంక్లిష్టమైన సంబంధాలుంటాయి..
మావోయిస్టులతో సంబంధాలున్నాయా అనే ప్రశ్నకు సాయిబాబా బదులిస్తూ.. మానవ సమాజంలో సంబంధాలుండటం అనేది అసలు నేరం కాదన్నారు. ఒక ప్రజాస్వామిక హక్కుల వ్యక్తిగా పనిచేస్తున్న తనకు అనేక శక్తులతో సంబంధాలుండటం సహజంగా పేర్కొన్నారు. ఒక ఫ్రొఫెసర్ గా తనకు ఒక ఉద్యమం లేదా రచయితలతో లేదా పత్రికలతో ఇతరత్ర సామాజిక ఉద్యమాలతో చాలా సంక్షిష్టమైన సంబంధాలుంటాయన్నారు. నాగరిక సమాజం ముందుకు వెళ్లాలంటే అనేక సంబంధాల సమూహాలతో చాలా సంక్లిష్టమైన సంబంధాలుంటాయన్నారు. ప్రతి విషయాన్ని నేరమయం చేసినట్లైతే మానవ సమాజం, మానవ జీవితం ముందుకు వెళ్లదని చెప్పారు. తన కేసులో తాను రాసిన ‘అకడమిక్ ఆర్టికల్స్’ కూడా నేరమైనవిగానే పోలీసులు చిత్రీకరిడచం హాస్యాస్పదమన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు..
మహారాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సాయిబాబాను అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు మాత్రం ఆ కేసును కొట్టివేసింది. ఇంతకు ఏం జరిగిందనే అంశంపై సాయిబాబా మాట్లాడుతూ.. ‘నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. నేను ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నట్లు ఆధారాలు చూపించలేకపోయారు. అయితే తన మీద కేసులు పెట్టడానికి ప్రధాన కారణం ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడటమే’ అన్నారు. 2010 నుంచి 2014 వరకూ ప్రముఖ ఫ్రొఫెసర్లతో కలిసి ఆదివాసుల మీద దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. వాళ్లను అడవులనుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టడంలో తాము కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నించడమే తమను నేరస్థులుగా ముంద్రిచారని చెప్పారు. ఇంకా సాయిబాబ ఏం చెప్పారు? జైలులో ఎంతటి నరకం చూశారనే పూర్తి సమాచారం వీడియోలో చూడండి.