SKN : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 'బేబీ' నిర్మాత.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

నిర్మాత SKN ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఆమె ఇంటికి వెళ్లిన ఆయన ఆటోను కానుకగా ఇచ్చారు. దీంతో SKN పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
SKN : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 'బేబీ' నిర్మాత.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Producer SKN Gifted Auto Rikshaw to Pawan Kalyan Fan : 'బేబీ' (Baby) సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకున్న SKN పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) లో గెలిచిన తర్వాత ఆయన అభిమాని అయిన మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని నిర్మాత ఎస్కేయన్‌ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ పిఠాపురం ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలవడమే కాకూండా ఏపీ డిప్యూటీ సీఎం గా సైతం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే SKN తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

ఇటీవల ఏపీ ఎలక్షన్స్ (AP Elections) ప్రచారంలో పలు మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో మరియమ్మ అనే మహిళ ‘పవన్‌కల్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులు పెట్టి, ఊరంతా పార్టీ ఇచ్చేస్తా' అని చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఆ వీడియోను జనసేన పార్టీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయగా, నిర్మాత ఎస్కేయన్‌ స్పందిస్తూ.." కల్యాణ్‌గారు గెలిచిన తర్వాత ఆటో రిక్షా కొని వీడియోలో ఉన్న మహిళ భర్తకు గిఫ్ట్‌ ఇస్తా. నా హీరో, అభిమాన నాయకుడి పట్ల ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమకు ఇదే బహుమతి" అని రిప్లై ఇచ్చాడు.

Also Read : జాక్వెలిన్‌ కు జైలు నుంచే ప్రేమలేఖ రాసిన సుకేశ్‌…100 మందికి ఆ బహుమతులు ఇస్తాడంట!

అన్నట్లుగానే గురువారం మరియమ్మ ఇంటికి వెళ్లిన ఆయన ఆటోను కానుగా ఇచ్చారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నాకెంతో ఇష్టమైన నాయకుడి పట్ల మరియమ్మ కుటుంబం చూపిన ప్రేమకు గుర్తుగా ఆటో కొనిచ్చా. వాళ్ల మనవడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పడం సంతోషంగా ఉంది. వాళ్ల కళ్లలో ఆనందం చూసి, ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రియతమ నాయకుడు పవన్‌కల్యాణ్‌గారికి మరింత శక్తినివ్వాలి. ఆయన గర్వపడేలా అభిమానులు, అనుచరులు నడుచుకోవాలి’’ అని ఎక్స్‌ వేదికగా మరియమ్మ కుటుంబంతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో SKN పై నెటిజన్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు