Naga Vamsi : బాలయ్య మందు బాటిల్ పై స్పందించిన నిర్మాత.. అది గ్రాఫిక్స్ అంటూ!

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య కూర్చున్న దగ్గర రెండు వాటర్ బాటిల్ లో మందు కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆ వీడియోలో మందు బాటిల్ లేదని, అవన్నీ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అని క్లారిటీ ఇచ్చాడు.

Naga Vamsi : బాలయ్య మందు బాటిల్ పై స్పందించిన నిర్మాత.. అది గ్రాఫిక్స్ అంటూ!
New Update

Producer Naga Vamsi: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  బాలయ్య (BalaKrishna) కూర్చున్న దగ్గర రెండు వాటర్ బాటిల్స్ కనిపించాయి. అందులో ఓ వాటర్ బాటిల్ మందు (Liquor) కూడా ఉండటం, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోని చూసిన నెటిజన్స్ బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మందు తాగాడని కామెంట్స్ కూడా చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆ వీడియోలో మందు బాటిల్ లేదని, అది అబద్ధమని క్లారిటీ ఇచ్చాడు.

Also Read : పవన్ కళ్యాణ్ నిర్మాత ఇంట్లో విషాదం..!

అది కంప్యూటర్ గ్రాఫిక్స్

తాజా ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. " బాల‌య్య వాట‌ర్ బాటిల్‌లో మందు క‌లుపుకోని రావ‌డం అనేది అబద్దం. అవన్నీ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌. సీజీ క్రియేట్ చేసి కావాల‌నే నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నారు. ఈవెంట్ అయిపోయేవ‌ర‌కు నేను అక్క‌డే ఉన్నా అసలు అక్కడ అలాంటి బాటిల్‌ ఏదీ లేదంటూ" నాగవంశీ తెలిపాడు. హీరో విశ్వ‌క్ సైతం దీనిపై సెటైరికల్ గా రియాక్ట్ అయ్యాడు. ఆ వీడియోను కంప్యూటర్‌ గ్రాఫిక్స్ చేసిన వ్య‌క్తి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి-2 కోసం ప‌ని చేయ‌బోతున్నాడు అంటూ చెప్పాడు.

ఇక 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari) సినిమా విషయానికొస్తే.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

#gangs-of-godavari #viswak-sen #balakrishna-alcohol-bottle #producer-nagavamsi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి