Producer Dil Raju : 'గేమ్ ఛేంజర్' లో SJ సూర్య పాత్రపై దిల్ రాజు కామెంట్స్..

'సరిపోదా శనివారం' విజయోత్సవ వేడుకలో నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఇందులో SJ సూర్య యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ..' గేమ్‌ ఛేంజర్‌' లో ఎస్‌జే సూర్య పాత్రకు థంపింగ్‌ రెస్పాన్స్‌ ఉండబోతుంది. ఆయన పాత్రను ప్రేక్షకులు ఘనంగా వేడుకగా జరుపుకుంటారని' చెప్పుకొచ్చారు.

New Update
Producer Dil Raju : 'గేమ్ ఛేంజర్' లో SJ సూర్య పాత్రపై దిల్ రాజు కామెంట్స్..

Producer Dil Raju : కోలీవుడ్ అగ్ర నటుడు SJ సూర్య సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయాడు. ముఖ్యంగా తెలుగులో ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీలో విలన్ రోల్ చేశాడు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య పోషించిన సీఐ దయానంద్ పాత్రను థియేటర్లలో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని కొన్ని సీన్స్ లో నానినే డామినేట్ చేశాడు.

అందుకే సినిమా చూసిన చాలామంది సినిమాలో మెయిన్ హీరో SJ సూర్యనే అని కామెంట్స్ చేశారు. అంతలా తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడు SJ సూర్య. ఇదిలా ఉంటే నిన్న 'సరిపోదా శనివారం' విజయోత్సవ వేడుక జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అటెండ్ అయ్యారు.

Also Read : నేను కూడా ఆ బాధితురాలినే..హేమా కమిటీ పై ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే సినిమాలో SJ సూర్య యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ..' గేమ్‌ ఛేంజర్‌' లో ఎస్‌జే సూర్య పాత్రకు థంపింగ్‌ రెస్పాన్స్‌ ఉండబోతుంది. ఆయన పాత్రను ప్రేక్షకులు ఘనంగా వేడుకగా జరుపుకుంటారని' చెప్పుకొచ్చారు. దీంతో దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు