Producer Bunny Vas About Mega Vs Allu Family War : మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు నడుస్తున్నాయంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైమ్ లో అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ను వదిలేసి తన సన్నిహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ కు సపోర్ట్ చేశాడు. తాజాగా ఇదే విషయాన్ని ఓ విలేకరి నిర్మాత బన్నీ వాస్ ను అడగ్గా.. ఆయన స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన కొత్త చిత్రం ‘ఆయ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దీనిపై మాట్లాడారు." మెగా, అల్లు ఫ్యామిలీను నేను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. అంతమంది స్టార్‌లను తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్ వస్తాయి.
Also Read : సరితూగే సమరమే, సంహారం తథ్యం”.. ఎస్. జే సూర్య బర్త్ డే స్పెషల్..!
అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్ చేయడం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి తెలుసు కాబట్టే.. నమ్మకంగా చెబుతున్నా. ‘మేమంతా ఒక్కటే’ అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్" అంటూ చెప్పుకొచ్చాడు.