Ashwani Dutt : 'కల్కి' పార్ట్-2 రిలీజ్ డేట్ రివీల్ చేసిన నిర్మాత.. ఎప్పుడంటే?

'కల్కి' పార్ట్ 2 పై నిర్మాత అశ్వినీదత్ సాలిడ్ అప్డేట్ అందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.." పార్ట్ 2 బ్యాలెన్స్ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలవుతుంది. అలాగే వచ్చే ఏడాది మే లేదా జూన్ లోనే సినిమా రిలీజ్ అవుతుంది" అని తెలిపారు.

New Update
Ashwani Dutt : 'కల్కి' పార్ట్-2 రిలీజ్ డేట్ రివీల్ చేసిన నిర్మాత.. ఎప్పుడంటే?

Producer Ashwani Dutt Update About 'Kalki' Part-2 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD'. నాగ్ అశ్విన్ డైరెక్ట్(Nag Ashwin) చేసిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన రాబట్టింది. సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.

అంతేకాదు పార్ట్-1 లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్-2 లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా 'కల్కి' పార్ట్ 2 పై నిర్మాత అశ్వినీదత్(Ashwani Dutt) సాలిడ్ అప్డేట్ అందించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.." పార్ట్ 2 బ్యాలెన్స్ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలవుతుంది. అలాగే వచ్చే ఏడాది మే లేదా జూన్ లోనే సినిమా రిలీజ్ అవుతుంది" అని తెలిపారు.

Also Read : గ్రాండ్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి.. రెసెప్షన్ కు వచ్చిన సినీ ప్రముఖులు, స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య!

ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న 'కల్కి' మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్నిమూవీ యూనిట్ వెల్లడిస్తూ సోషల్‌ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. రిలీజైన ఏడు రోజుల్లోనే 700 కోట్ల కలెక్షన్స్ అంటే బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు