Uric Acid: యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఎప్పుడూ ఉంటుంది. కానీ, దాని స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు (Health Issues) తలెత్తుతాయి.మనకు దాని గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల, ప్రారంభంలో దాని కారణాలను తెలుసుకోలేము. ఇది క్రమంగా పెరుగుతున్నప్పుడు, దాని దుష్ప్రభావాలు చాలా కనిపిస్తాయి. ఊబకాయం, మధుమేహంతో (Diabetes) బాధపడేవారిలో యూరిక్ యాసిడ్ పెరగడం చాలా సాధారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మోకాళ్లు, వేళ్లు,కాలి వేళ్లలో నొప్పి మొదలవుతుంది. పెరిగిన యూరిక్ యాసిడ్ వల్ల ప్రమాదం ఎవరికీ ఎక్కువ ఉంటుందో తెలుసుకుందాం.
ఎవరు ప్రమాదంలో ఉన్నారు?
థైరాయిడ్ (Thyroid) సమస్య, అధిక రక్తపోటు, శరీరంలో ఐరన్-గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్ అసిడోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనిడాక్టర్లు చెబుతున్నారు. దీనివలన యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదం పెరుగుతుంది. మీ రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, హైపర్యూరిసిమియా - ఆర్థరైటిస్ వంటి సమస్యలు సంభవించవచ్చు.
పురుషులలో ఎక్కువ ప్రమాదం
మహిళలతో పోలిస్తే పురుషుల్లో యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్లు అంటున్నారు. దీనితో పాటు, జన్యుపరమైన కారణాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. రోజూ ఆల్కహాల్, బీర్ లేదా డిస్టిల్డ్ వాటర్ తాగే వ్యక్తులు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఇది మాత్రమే కాదు, ఆస్పిరిన్ వంటి కొన్ని మందులు కూడా యూరిక్ యాసిడ్‌ను పెంచుతాయి.
Also Read: నిపా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. చివరి దశలో ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలు
ఎలా నియంత్రించాలి
మీ రక్తంలో యూరిక్ యాసిడ్(Uric Acid) మొత్తాన్ని నియంత్రించాలని, దీని కోసం రోజుకు 2 లీటర్ల కంటే ఎక్కువ నీరు (Water) త్రాగాలని, మీ బరువు, రక్తపోటు, ఉప్పు తీసుకోవడం నియంత్రించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా, రెడ్ మీట్, మితిమీరిన తీపి పదార్థాలు, మద్యం, అదనపు పప్పుల వినియోగాన్ని తగ్గించుకోవాలి. అంతే కాకుండా, మీ ఆహారంలో అరటి, యాపిల్, సిట్రస్ పండ్లు, దోసకాయ, క్యారెట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, గ్రీన్ వెజిటేబుల్స్, పాలు, ఫైబర్ అధికంగా ఉండే వాటిని పెంచండి.
గమనిక: ఈ ఆర్టికల్ పాఠకుల ప్రాథమిక సమాచారం కోసం ఇచ్చినది. ఇందులో ఎటువంటి మెడిసిన్స్ రికమండ్ చేయలేదు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినపుడు వైద్య సహాయం పొందడం మంచిది అని సూచిస్తున్నాము.
Watch this interesting Video