అతను పొట్టివాడే కానీ పొగరు ఎక్కువ.. ప్రియాంక గాంధీ సెటైర్లు

బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతను పొట్టిగానే ఉంటాడు కానీ పొగరు ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి గ్వాలియర్, చంబా ప్రజలకు సింథియా పెద్ద ద్రోహం చేశారంటూ దాతియాలోని ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు.

అతను పొట్టివాడే కానీ పొగరు ఎక్కువ.. ప్రియాంక గాంధీ సెటైర్లు
New Update

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడొక ద్రోహీ, ప్రజలు అతన్ని గుడ్డిగా నమ్మి మోసపోవద్దంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యప్రదేశ్ దాతియాలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె గతంలో యూపిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

నిజానికి ఆయన పొట్టిగానే ఉంటారు కానీ.. పొగరు చాలా ఎక్కువ. తోటి నాయకుల దగ్గరకూడా అహంకారం చూపిస్తారు. అతని ప్రవర్తనతో చాలామంది నాయకులు ఇబ్బంది పడ్డారు. అతని దగ్గరకు ఎవరు వెళ్లినా మహారాజ్ అని పిలవాలి. లేదంటే  ఎన్నిసార్లు పలకరించిన స్పందించరు. మన బాధలు అసలే వినరు. సమస్యలను పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు అని ప్రియాంక అన్నారు. అలాగే తాము యూపీకి చెందిన వాళ్లమే. కోపం వచ్చినప్పుడే దాన్ని బయటపెడతాం. కానీ మహారాజ్ అని పిలిచే అలవాటు తమకు లేదన్నారు. ఇక 2020లో మధ్య ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి గ్వాలియర్, చంబా ప్రజలకు సింథియా పెద్ద ద్రోహం చేశారంటూ ప్రియాంక మండిపడ్డారు.

Also read : లైంగిక దాడికి యువకుడి యత్నం.. నమ్మించి అది కోసేసిన మహిళ

ఇక మధ్య ప్రదేశ్ లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రి సీటు విషయంలో మనస్పర్థలు వచ్చాయి. కమల్ నాథ్ కు సీఎం పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన సింథియా 20 మంది తన సన్నిహిత ఎమ్మెల్యేలను కూడగట్టుకుని కొన్ని నెలల్లోనే బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోగా బీజేపీ గవర్నమెంట్ ఏర్పడింది. ఇక 2023 నవంబర్ 17న మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.

#madhya-pradesh #priyanka-gandhi #jyotiraditya-scindia
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe