Telangana Elections 2023 : కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రాహుల్..!! నేడు కొల్లాపూర్ లో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగసభకు గెస్టుగా వస్తున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యింది. చివరి క్షణంలో ప్రియాంక టూర్ రద్దు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రియాంక స్థానంలో సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. By Bhoomi 31 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Priyanka Gandhi Kolhapur Tour Cancelled: నేడు కొల్లాపూర్ లో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా వస్తున్న ప్రియాంకగాంధీ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. అనారోగ్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దు అయినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి (Congress Party) కంచుకోట వంటిది. దీంతో సభకు భారీ సంఖ్యలో జనసమీకరణ ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. చివరి నిమిషంలో ప్రియాంక సభకు గైర్హజరు అవుతున్నట్లు తెలిపింది. ప్రియాంక స్థానంలో సభకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరుకానున్నారు. ప్రియాంకకు బదులుగా రాహుల్ గాంధీ కొల్లాపూర్ పర్యటించునున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా చదవండి: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ట్విస్ట్…!! కాగా నేడు, రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం కొల్లాపూర్ లో పాలమూరు ప్రజా భేరి సభలో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ప్రసంగం అనంతరం కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు. రేపు ( నవంబర్ 1)న కల్వకుర్తి సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం జడ్చర్లలో కార్నర్ మీటింగ్ లో పాల్గొని...అక్కడి నుంచి షాద్ నగర్ పట్టణంలో పాదయాత్ర నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక నవంబర్ 2వ తేదీన జరగాల్సిన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఎందుకంటే 3వ తేదీ నుంచి నామినేషన్లు ఉన్నందున ఈ పర్యటన వాయిదా వేశారు. నామినేషన్ల తర్వాత తిరిగి రాహుల్ గాంధీ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు సీఐడీ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు! #rahul-gandhi #telangana-elections-2023 #priyanka-gandhi #kolhapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి