Priyanka Gandhi Comments: మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు దేశంలో రైతులకు రుణమాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అన్నారు ప్రియాంక గాంధీ. కానీ, కోటీశ్వరుల అప్పులను తీర్చేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయని చురకలు అంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 15 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Priyanka Gandhi Comments: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi Comments). ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).. బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. పేద ప్రజల బాకీలు తీర్చేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ కోటీశ్వరుల అప్పులు తీర్చేందుకు డబ్బులు మాత్రం ఉంటాయని విమర్శించారు. ALSO READ: నామినేషన్ వెయ్యకుండా ఆపుతున్నారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు రైతు రుణమాఫీ చేస్తామని అని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అధికారంలో ఉండి 10 ఏళ్లు గడుస్తున్న రైతు రుణమాఫీ ఒక్క రూపాయి కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు రుణాలు మాఫీ చేయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి ప్రజలు మోసం చేసేందుకు తప్పుడు హామీలతో ముందుకు వచ్చారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. #WATCH | Addressing a public meeting in Uttar Pradesh's Raebareli, Congress general secretary Priyanka Gandhi Vadra says, "You take loans when you don't have enough food to eat...when it's about life, even then PM Modi's govt don't have money to waive off your loans..." pic.twitter.com/su071tKkyz — ANI (@ANI) May 15, 2024 "ఈరోజు మీరు చూసే మీడియా, టీవీ ఛానెళ్లలో దేశం పురోగమిస్తోందని, ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని, మీరు టీవీల్లో సంతోషంగా ఉన్న రైతులను చూస్తారు. కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయని పనిని ఈ పదేళ్లలో ప్రధాని మోదీ చేశారని చూపిస్తున్నారు. అన్ని ఛానెల్‌లు బిలియనీర్లకు చెందినవి కాబట్టి మీరు దీన్ని చూస్తారు, బీజేపీ ఈ 10 సంవత్సరాలలో అన్నింటినీ కొనుగోలు చేసింది. మీరు సత్యాన్ని చూడలేరు, నిజం మీ జీవితంలో ఉంది, మీరు ఏ పురోగతి సాధించలేదు.:" అని మాట్లాడారు. #WATCH | Addressing a public meeting in Uttar Pradesh's Raebareli, Congress general secretary Priyanka Gandhi Vadra says, "The media that you see today, on TV channels they'll tell you that the country is progressing, the economy is getting stronger, you see happy farmers on TV.… pic.twitter.com/AA5NQHhD9x — ANI (@ANI) May 15, 2024 #priyanka-gandhi #pm-modi #priyanka-gandhi-vadra #priyanka-gandhi-update మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి