Cyber Fraud: హైదరాబాద్ డాక్టర్‌ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఆ మెసేజ్‌పై క్లిక్ చేస్తే రూ.19 లక్షలు ఫసక్! కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న 29 ఏళ్ల డాక్టర్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలిగ్రామ్‌లో వచ్చిన మెసేజ్‌ను నమ్మి విడతల వారిగా రూ.19 లక్షలు పొగొట్టుకున్నాడు డాక్టర్. పార్‌టైమ్ జాబ్ పేరుతో ఈ మోసం జరిగింది. By Trinath 22 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి టెలిగ్రామ్(Telegram) వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. యాప్ ఓపెన్ చేయగానే అడ్డదిడ్డమైన మెసేజీలు వస్తుంటాయి. ఎవరెవరో మెసేజీలు చేస్తుంటారు. జాబ్ కావాలా, డబ్బులు కావాలా? అంటూ మెసేజీలు పంపిస్తుంటారు. గంటకు 10 వేలు సంపాదించుకోవచ్చని చెబుతుంటారు. అందులోనూ మెసేజీలు సెండ్ చేసే వారి డిస్‌ప్లే పిక్చర్(డీపీ) అమ్మాయిది ఉంటుంది. అది కూడా క్యూట్ ఫొటో ఉంటుంది. వారి టెక్ట్స్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాయి. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన గురించి తెలుసుకుంటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. రూ.19లక్షలు ఫసక్: హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తామన్న కేటుగాళ్ల మాటలు నమ్మి రూ.19.7 లక్షలు పోగొట్టుకున్నాడు. ముందుగా ఆయనకు టెలిగ్రామ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఓ లింక్ సెండ్ చేశారు. ఉత్పత్తులను సమీక్షించమన్నారు. అంటే రివ్యూలు ఇవ్వాలన్నమాట. ఇలా కొన్ని టాస్క్‌లు ఇస్తారు. వాటిని పూర్తి చేయమంటారు. కంప్లీట్ చేసిన తర్వాత స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయమని అడుగుతారు. ఒక డిజిటల్ వాలెట్‌లో డబ్బులు పడుతున్నట్లు చూపిస్తారు. టాస్క్ కంప్లీట్ చేసే కొద్దీ మన ఖాతాలో డబ్బులు పడుతున్నట్లు చూపిస్తుంది. Also Read: రజనీకాంత్, మోహన్ బాబు ధరించిన ‘పెదరాయుడు పంచె’కు అరుదైన గుర్తింపు! అయితే ముందు టాస్క్‌ను స్టార్ట్ చేయడానికి రూ.10,900 డిపాజిట్ చేయమని అతనిని కోరగా.. అందుకు పే చేశాడు. వెంటనే తన వాలెట్‌లో రూ.15,000 పడినట్లు మెసేజ్ వచ్చింది. తర్వాత రూ.20,000 డిపాజిట్ చేయమని అడిగారు.. వెంటనే రూ.52,427 డబ్బులు యాడ్ అయ్యాయి. అయితే ఇదంతా వర్చ్యూవల్‌గానే. ఇలా ఇదంతా నిజమేనని నమ్మిన అక్టోబర్ 6 నుంచి నవంబర్ 7 వరకు జరిపిన 11 లావాదేవీల్లో 19.4 లక్షలు సెండ్ చేశాడు. అతనికి 27.85 లక్షలు వస్తాయని చెప్పారు. అయితే తన మనీ సెండ్ చేయమని అడిగాడు. కానీ కేటుగాళ్లు.. ఇంక డబ్బులు వెయ్యాలని అడిగారు. దీంతో మోసపోయానని గుర్తించిన వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 420, ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డి కింద కేసు నమోదు చేశారు. డాక్టర్ కుకట్‌పల్లిలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే! WATCH: #hyderabad #cyber-fraud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి