వరద నీరు ఉధృతం
కొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి వంతెనలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుతోంది. దీంతో వాగు మధ్యలో ఓ బస్సు చిక్కుకోని అందరిని టెన్షన్‌కి గురిచేసింది. ఏక్షణం ఏమవుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులందరూ భయటపడ్డారు. సోమవారం (జూలై 24) ఒడిశా ప్రయాణికులతో వస్తున్న బస్సు కుయుగూరు వాగు వద్ద వంతెన వద్దకు చేరుకుంది. అప్పటికే వంతెన మీదుగా నీరు పొర్లుతున్నాయి. వంతెన దాటియవచ్చని భావించిన డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడిపాడు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బస్సు ముందుకు కదలలేదు. నీళ్ల మధ్యలో బస్సులో నిలిచిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోడ్డుకు చేరుకున్నారు ప్రయాణికులు.
తప్పిన ప్రమాదం
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ వరద నీరు పోటెత్తడంతో జనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఓ పక్కన నదుల నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంటుంది. జోరు వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ఏజెన్సీలో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ వర్షం వల్ల శబరి (SHABARI NADI) నదికి వరద నీరు పోటెత్తింది. చింతూరు వద్ద ప్రాజెక్టు నీటిమట్టం 31 అడుగులు చేరుకుంది. ఒడిశా (ODISHA) రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ గుప్తా బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సోమవారం( MONDAY) ఉదయం ఒడిశా రాష్ట్రం నుండి ఏపీకి వస్తున్న బస్సు ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు–నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై అప్పటికే కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరి ఉంది. తెల్లవారుజామున 4.30 గంటలు కావడంతో వరద నీరు సరిగా కనిపించకపోవడంతో డ్రైవర్ వరద నీటిలోనే బస్సును ప్రయత్నం చేశాడు. అయితే రహదారి పక్కకు వెళ్లి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన డ్రైవర్ (Driver) బస్సును ఆపి బస్సులో ఉన్న సుమారు 45 మంది ప్రయాణికులను దించేసాడు. ప్రయాణికులు అక్కడి నుండి మోకాళ్ళ లోతు వరద నీటిలో నడుచుకుంటూ రోడ్డు మీదకు చేరుకున్నారు. ప్రయాణికులందరూ రోడ్డుపైకి చేరుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు రెవిన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ, సిబ్బంది సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు.
ట్రాఫిక్ అంతరాయం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి (Maredumilli) ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న వానలకి వాలమూరు వాలిసుగ్రీవు విగ్రహాల సమీపంలో భారీ వృక్షాలు కూలి రోడ్డుపై పడ్డాయి. వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్లో తెల్లవారుజాము నుండి భారీగా వాహనాలు నిలిచిపోగా ఇరువైపుల భారీగా ట్రాఫిక్‌జామ్ (Traffic jam) అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రోడ్డు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే మార్గం కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.పెద్ద సంఖ్యలో లారీలతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. అధికారులు చర్యలు తీసుకొని విరిగిపడిన చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీనివల్ల గంటల కొద్దీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు.