Agriculture Sector : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ (Union Budget 2024) ప్రసంగంలో వ్యవసాయరంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో 1.52 లక్షల కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రకటించారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
- ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం
- దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
- అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
- ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నాం
- నాలుగు కోట్ల యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం
- బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్ద పీట
- వ్యవసాయ పరిశోధనారంగానికి ప్రాధానత
- వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు
- ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
- వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
- ఉపాధి - నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 2 లక్షల కోట్ల రూపాయల కేటాయింపుతో ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి 5 పథకాలను ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు.
- ధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి పథకాల ద్వారా ఉపాధి నైపుణ్యాలను ప్రకటించారు.
- ఈ పథకాలు ఈపీఎఫ్‌వోలో నామినేషన్‌పై ఆధారపడి ఉంటాయని, ఇది మొదటి సారి ఉద్యోగులను గుర్తించడంపై దృష్టి సారిస్తుందని చెప్పిన నిర్మలా సీతారామన్
"అన్ని అధికారిక రంగాలలో మొదటి సారి పనిచేసే కార్మికులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించిన తర్వాత ఒక నెల జీతం పొందుతారు. 15,000 వరకు ఒక నెల జీతం యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మూడు వాయిదాలలో అందిస్తారు. ఈ ప్రయోజనం కోసం అర్హత పరిమితి నెలకు రూ. 1 లక్ష జీతం. దీని ద్వారా 2.1 లక్షల మంది యువత లబ్ధి పొందుతారని అంచనావేస్తున్నాం" అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Also Read : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు