ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పూణేలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పర్యటనలో ప్రధానమంత్రి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును కూడా అందుకోనున్నారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ఈ అవార్డును అందజేస్తారు.
ప్రధాని మోదీ పూణే పర్యటనలోని ముఖ్యాంశాలు:
-పూణే మెట్రో మొదటి దశ రెండు కారిడార్లలో పూర్తయిన సెక్షన్లలో సేవల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని PMO తెలిపింది. ఈ విభాగాలు ఫుగేవాడి స్టేషన్ నుండి సివిల్ కోర్ట్ స్టేషన్ వరకు, గార్వేర్ కాలేజ్ స్టేషన్ నుండి రూబీ హాల్ క్లినిక్ స్టేషన్ వరకు ఉన్నాయి. 2016లో ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. కొత్త స్ట్రెచ్‌లు పూణే నగరంలోని శివాజీ నగర్, సివిల్ కోర్ట్, పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, పూణే RTO, పూణే రైల్వే స్టేషన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఆధునిక, పర్యావరణ అనుకూల పట్టణ రవాణా వ్యవస్థలను అందించాలనే ప్రధానమంత్రి దృష్టిని నెరవేర్చే దిశగా ఈ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ముందడుగు అని PMO పేర్కొంది.
-దీని మార్గంలో కొన్ని మెట్రో స్టేషన్ల రూపకల్పన ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రేరణతో రూపొందించారు. ఛత్రపతి శంభాజీ ఉద్యాన్ మెట్రో స్టేషన్, దక్కన్ జింఖానా మెట్రో స్టేషన్‌లు ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు ధరించే తలపాగాను పోలి ఉండేలా రూపొందించారు. దీనిని 'మావ్లా పగ్డీ' అని కూడా పిలుస్తారు. శివాజీ నగర్ భూగర్భ మెట్రో స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన కోటలను తలపించే ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉందని పీఎంవో తెలిపింది.
-ఈ సందర్భంగా పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) పరిధిలోని వ్యర్థాలను వినియోగించే పవర్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబడిన ఈ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి ఏటా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తుంది.
-ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పీసీఎంసీ నిర్మించిన 1,280 ఇళ్లను ప్రధానమంత్రి చేతుల మీదుగా అందజేయనున్నారు. పూణె మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన 2,650 PMAY ఇళ్లను కూడా ఆయన అందజేయనున్నారు. అంతేకాకుండా, PCMC ద్వారా నిర్మించబడే సుమారు 1,190 PMAY గృహాలకు, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్మించబడే 6,400 గృహాలకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీని లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో సత్కరిస్తారు. లోకమాన్య తిలక్ వారసత్వాన్ని పురస్కరించుకుని 1983లో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. దేశం యొక్క పురోగతి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ఈ అవార్డును అందజేస్తారు. ప్రధాని మోదీ కంటే ముందు, ఈ అవార్డును మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్‌లతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, 'మెట్రో మ్యాన్' ఇ వంటి 40 మంది అనుభవజ్ఞులకు అందించారు.