PM Modi : అతి ఎప్పుడూ మంచిది కాదు..నేను ఫోన్ ఎలా వినియోగిస్తానో తెలుసా..?

అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోదీ ఈ విధంగా విద్యార్థులకు సలహా ఇచ్చారు.

New Update
PM Modi : అతి ఎప్పుడూ మంచిది కాదు..నేను ఫోన్ ఎలా వినియోగిస్తానో తెలుసా..?

PM Modi : అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని విద్యార్థులకు హితవు పలికారు. కొన్నివారాల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు నిర్వహించిన పరీక్షా పే చర్చ(pariksha pe charcha 2024) కార్యక్రమంలో మోదీ(pm modi) ఈ విధంగా విద్యార్థులకు సలహా ఇచ్చారు.

అవసరం ఉంటేనే ఫోన్ వాడతాను..స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ..మీ ఫోన్లలో స్క్రీన్ టైం అలర్ట్ టూల్స్(Screen Time Alert Tools) ను ఉపయోగించండంటూ విద్యార్థులకు సలహా ఇచ్చారు. మొబైల్స్ చూస్తు సమయాన్ని వేస్ట్ చేయకూడదన్నారు. మనం సమయాన్ని గౌరవించాలన్నారు. అలాగే పిల్లల ఫోన్ల పాస్ట్ వర్డులు కుటుంబ సభ్యులు తప్పకుండా తెలుసుకోవాలని ప్రధాని మోదీ తల్లిదండ్రులకు సూచించారు. టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరంగా ఉండకూడదన్న ప్రధాని..కానీ దానిని సానుకూల ప్రభావం చూపే విధంగా మాత్రమే వినియోగించాలన్నారు. పరీక్షలు రెడీ అవుతున్న తరుణంలో పిల్లలు చిన్న చిన్న లక్ష్యాలను విధించుకుని క్రమంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించాలన్నారు. ఈ విధంగా చదువుతే పరీక్షలకు పూర్తిగా సిద్ధమవుతారని ప్రధాని అన్నారు.

మనిషి శరీరానికి కూడా రీఛార్జింగ్ అవసరమన్న మోదీ:
మనం సరిగ్గా పనిచేయాలన్నా..ఆరోగ్యంగా ఉండాలన్నా మొబైల్ ఫోన్ల మాదిరి మనకు కూడా రీఛార్జింగ్ అవసరమన్నారు ప్రధాని మోదీ. విద్యాలో రాణించాలంటే శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మోదీ పలు కీలక సూచనలు చేశారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు మన శారీరక ఆరోగ్యం చాలా అవసరం. దీనికోసం సూర్యకాంతిలో కొంత సమయం పాటు నిలబడాలి. రోజూ తగినంత నిద్రపోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. వీటితోపాటుగా వ్యాయామం కూడా ఖచ్చితం చేయాలన్నారు. అప్పుడే మనశరీరం ఫిట్నెస్ తోపాటుఆరోగ్యంగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు.

కాగా మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఈ ఏడాది 2.26కోట్ల మంది నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానిలోని భారత మండపంలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ఆన్ లైన్ ద్వారా వీక్షించారు.

ఇది కూడా చదవండి: తల్లికి ‘పద్మవిభూషణ్ చిరంజీవి’ స్పెషల్‌ బర్త్‌డే విషెష్‌..ఫొటోలు వైరల్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు