ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల సరసన ఫోర్బస్ మ్యాగజైన్‍లో స్థానం సంపాదించారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‍గా ఖ్యాతికెక్కిన ఘనత కూడా భారతీయ ప్రధానమంత్రుల చరిత్రలో మోదీదే అని చెప్పవచ్చు. మోదీ దినచర్య యోగాతో ప్రారంభం అవుతుంది. క్షణం తీరిక లేకుండా సాగిపోయే ఆయన రోజువారీ కార్యకలాపాలలో కూడా ప్రశాంతంగా, దృఢచిత్తంతో వ్యవహరించడానికి యోగా ఆయనకు ఉపయోగపడుతోంది. ఉదయం 5 గంటలకు నిద్రలేచి 30 నుంచి 45 నిమిషాల పాటు యోగా చేస్తారు. ఉదయం 8 గంటలకు పార్టీ కార్యకర్తలు, స్నేహితులను కలుస్తారు.
ఇది కూడా చదవండి: ఐస్ క్రీమ్ తినడం వలన కలిగే లాభాలు..తక్షణ శక్తి కోసం తినాల్సిందే
9 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసి తన ట్విట్టర్, పర్సనల్ వెబ్‌సైట్లను ఒక సారి చూసుకుంటారు. ఉదయం 9:30 గంటలకల్లా మోదీ పీఎం ఆఫీస్‌కు చేరుకుంటారు. తర్వాత ఆ రోజు చేయాల్సిన పనులు, అధికారులు, మంత్రులతో సమావేశాల గురించి సెక్రటరీ మోదీకి వివరిస్తారు. ఆ తర్వాత మోదీ పీఎంవో అధికారులు ఇచ్చిన ఫైల్స్, ప్రజంటేషన్లను చూస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన భోజనం చేస్తారు. రాత్రి 8:30తో మోదీ షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత ఆయన తన పర్సనల్ కంప్యూటర్ ముందు వాలిపోతారు. దేశం నలుమూలలా ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.
మోదీకి ప్రత్యేక గుర్తింపు
ఏదైనా విషయం తనకు నచ్చితే వారిని పిలిపించుకుని అభినందిస్తారు. కుదరకపోతే నోట్ చేసుకోవాలని తన స్టాఫ్‌కి చెబుతారు. తనకు నచ్చిన అంశాన్ని మన్‌కీ బాత్‌లోనూ ప్రస్తావిస్తారు. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో సిబ్బంది ఏం పోస్టులు చేస్తున్నారో గమనిస్తారు, వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండేందుకు ఆయన సాంకేతిక విజ్ఞానాన్ని వారధిగా చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశేషమైన మక్కువ గల నాయకునిగా మోదీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫేస్‍బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, ఇన్‍స్టాగ్రామ్, సౌండ్ క్లౌడ్, లింక్‍డ్ ఇన్, వీబో వంటి భిన్న సామాజిక మీడియా వేదికలపై ఆయన చురుగ్గా ఉంటూ, ప్రజలతో భావాలు పంచుకుంటూ ఉంటారు.