'కుటుంబవాద వలయంలో తెలంగాణ'.. కేసీఆర్‎ను ఉతికారేసిన మోడీ..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ హన్మకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం శక్తివంచన లేకుండా ఎంతో క్రుషి చేసిందన్నారు ప్రధాని. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోచుకునే పని మాత్రమే చేసిందని ప్రధాని మోడీ అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి తప్ప మరేమీ చేయలేదని, రాష్ట్రాన్ని ముంచడానికే పని చేశారని ప్రధాని అన్నారు. అవినీతి తంతు ఢిల్లీ వరకు ముడిపడి ఉందని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోడీ.

author-image
By Bhoomi
New Update
'కుటుంబవాద వలయంలో తెలంగాణ'.. కేసీఆర్‎ను ఉతికారేసిన మోడీ..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ హన్మకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం శక్తివంచన లేకుండా ఎంతో క్రుషి చేసిందన్నారు ప్రధాని. కేసీఆర్ ప్రభుత్వం చేసింది కేవలం నాలుగు పనులే అన్నారు. పొద్దున లేచింది మొదలు...ప్రధాని మోడీని, కేంద్రాన్ని దుర్భాషలాడటం తప్పా కేసీఆర్ తెలంగాణకు ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబవాద వలయంలో, అవినీతిలో ముంచారంటూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

modi warangal

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ తెలంగాణలో రూ. 6.100కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హన్మకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ...భద్రకాళి అమ్మవారి మహాత్యానికి సమ్మక్క, సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన ఓరుగల్లుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఒక బీజేపీ కార్యకర్తగా వరంగల్ కు వచ్చానని చెప్పిన మోడీ..జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందన్నారు.

ఇక ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయపార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. అందులో తెలంగాణ అతిముఖ్యమైన భూమికను పోషిస్తుందన్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ మంచి ట్రైలర్ ను చూపించందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల అడ్రస్సు గల్లంతు చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన మోడీ...కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసింది నాలుగు పనులు మాత్రమేనని అన్నారు. మోడీ. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం తప్పా...కేసీఆర్ ఇంకేం చేయలేదన్నారు. తెలంగాణ అభివ్రుద్ధిని అడ్డుకుంటూ తెలంగాణను అవినీతిలో ముంచుతున్నారంటూ మోడీ మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ అంటేనే అత్యంత అవినీతి ప్రభుత్వం అన్నారు. వారి అవినీతి రాష్ట్రం నుంచి ఢిల్లీకి కూడా పాకిందన్నారు. కేంద్రాన్ని విమర్శించడమే పని తప్పా బీఆర్ఎస్ కు ఇంకో పని లేదన్నారు. తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోని కేసీఆర్ కేవలం తన కుటుంబాన్ని పెంచిపోషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం స్కామ్ లలో ఇరుక్కుందన్నారు.

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిందని...టీఎస్పీఎస్సీ స్కాంతో యువత చాలా నష్టపోయారని అన్నారు మోడీ. కాంగ్రెస్, బీఆర్ఎష్ ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు ప్రాణాంతకంగా మారాయన్నారు. ఈ రెండింటిని తెలంగాణ నుంచి తరిమికొట్టి...తెలంగాణ అభివ్రుద్ధికి పట్టం కట్టే పార్టీని గెలిపించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై సర్పంచ్ లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో కేంద్రం గ్రామపంచాయితీలకు లక్షకోట్లకు పైగా నిధులు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. తాము రైతుల పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామని చెప్పారు. తెలంగాణకు మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఇచ్చామని చెప్పిన మోడీ...కేసీఆర్ సర్కార్ మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, పేదలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు.

చివరిగా ఈ సభకు వచ్చిన జనాలను చూస్తుంటే హైదరాబాద్ లో ఉన్న కొందరికి నిద్ర కరువైతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు మోడీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు