Ayodhya Rama mandir:11 రోజులపాటు మోడీ చేస్తున్న అనుస్టానంలో కొబ్బరి నీళ్ళు మాత్రమే ఎందుకు తాగుతారు?

అయోధ్యలోని రామలల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మోడీ నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అనుష్టానం చేస్తున్నారు.రామమందిర ఆచారాల సమయంలో మోడీ కొబ్బరి నీళ్లను మాత్రమే సేవిస్తారు.

Ayodhya Rama mandir:11 రోజులపాటు మోడీ  చేస్తున్న అనుస్టానంలో కొబ్బరి నీళ్ళు మాత్రమే ఎందుకు తాగుతారు?
New Update

Ayodhya Rama mandir :జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర్ రామలల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జనవరి 12 నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అనుష్టానం చేస్తున్నారు. 11 రోజుల రామమందిర ఆచారాల సమయంలో ప్రధాని మోడీ కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకుంటారు.

ప్రత్యేకమైన 'సాత్విక్' ఆహారం తీసుకుంటున్న ప్రధాని మోడీ
ప్రాణ ప్రతిష్ట పూజకు సంబంధించి ప్రధాని మోడీ ప్రతి నిబంధనను పాటిస్తు.. ప్రత్యేకమైన 'సాత్విక్' ఆహారం తీసుకుంటున్నారు , అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి , అనేక ఇతర వస్తువులను కూడా నిషేధించడం జరిగింది.ఈ క్రమంలో ప్రధాని మోదీ రోజుకు రెండు సార్లు మాత్రమే కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
కొబ్బరినీళ్లు తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా ఉండి, కడుపులో మంట, పేగుల్లో వాపు, వాంతులు, విరేచనాలు, అల్సర్ వంటి సమస్యల భయం బాగా తగ్గుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగాఉంటాయి
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి విముక్తి చేస్తాయి. దీన్ని తాగడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తి
కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన ఖనిజాలు , విటమిన్లు అందుతాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రోజూ కొబ్బరినీళ్లు తాగేవారికి రోగాల భయం తక్కువగా ఉంటుంది.

గుండెకు మంచిది
ఈ పానీయం గుండెకు చాలా మంచిది. దీని వినియోగం చెడు కొలెస్ట్రాల్‌ను వదిలించుకోవడమే కాకుండా రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ భయం కూడా తగ్గుతుంది.

ALSO READ:శనివారం రోజు ఈ 5 పనులు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త !!

#modi #11days-ram-mandir-rituals #ayodhaya-ramamandir
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe