BIG BREAKING: భారీగా తగ్గనున్న బంగారం, సెల్ ఫోన్ ధరలు బడ్జెట్‌లో బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు కిందికి దిగిరానున్నాయి. అలాగే మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తునట్లు ప్రకటించారు. By V.J Reddy 23 Jul 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Gold Rates: 2024-25 బడ్జెట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లు ఉండగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది మోదీ సర్కార్. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లను మంజూరు చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థికలోటు తగ్గుతోందని అన్నారు. ఆర్థిక లోట 4.9 శాతంగా ఉందని చెప్పారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు కస్టమ్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు తీపి కబురు అందించారు. మేడిన్ ఇండియా మెడికల్ పరికరాలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తునట్లు ప్రకటించారు. 20 రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నామని తెలిపారు. అలాగే బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ధరలు తగ్గనున్నాయి.. *మందులు, వైద్య పరికరాలు *మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు *సోలార్ ప్యానెళ్లు * దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం ఉంది. #gold-rates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి