Bike, Scooter Price Hike: భారీగా పెరగనున్న బైక్, స్కూటర్ ధరలు.. ఎంతంటే..!!

టూవీలర్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. హీరో మోటోకార్ప్ టూవీలర్స్ ధరలను భారీగా పెంచేస్తూ పండగ సీజన్ లో కస్టమర్లకు షాకిచ్చింది. తాజా ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోండి.

New Update
Bike, Scooter Price Hike: భారీగా పెరగనున్న బైక్, స్కూటర్ ధరలు.. ఎంతంటే..!!

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ స్కూటర్స్, బైక్స్ ధరలు పెంచింది. అక్టోబర్ 3 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎక్స్-షోరూమ్ ధరల్ని పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ సెప్టెంబర్ 29న స్టాక్ ఎక్స్ఛేంజెస్‌కు తెలిపింది. ధర పెరుగుదల దాదాపు 1శాతం ఉంటుంది. నిర్దిష్ట మోడల్స్, మార్కెట్‌లను బట్టి పెరుగుదల ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఎంపిక చేసిన మోడల్‌లు, మార్కెట్‌లను బట్టి ధరల పెరుగుదల మారుతూ ఉంటుంది. ఉత్పత్తి పోటీతత్వం, స్థానాలు, ద్రవ్యోల్బణం, మార్జిన్లు, మార్కెట్ వాటాపై రెగ్యులర్ సమీక్షలో భాగంగా ధరలలో మార్పు చేసినట్లు కంపెనీ తెలిపింది. మోటోకార్ప్ ఈ నెల ప్రారంభంలో ఆగస్టులో మొత్తం అమ్మకాలు 6శాతం పెరిగాయి. 4,88,717 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఇక పెరిగిన ధరలను చూస్తే....

- హీరో కరిజ్మా XMR మోడల్ ధర రూ.7,000 పెరిగింది. ప్రస్తుతం 1,79,900కి చేరింది.
-హీరో కరిజ్మా XMR బుకింగ్ విండో రూ.1,72,900

ఇది కూడా చదవండి: తెలంగాణలో సంచలన తీర్పు.. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష..!!

ఇక ఏ మోడల్ పై ఎంత పెరిగిందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆగస్టు 2022లో 4,50,740 యూనిట్లతో పోలిస్తే దేశీయ విక్రయాల్లో 5శాతం పెరిగింది. 4,72,947 యూనిట్లు ఉండగా...ఎగుమతులు గతేడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగింది. గత మూడునెలల్లో హీరో మోటోకార్ప్ ధరల పెంపును ప్రకటించడం వరుసగా ఇది రెండోసారి. గతంలో జూలై 3న సెలక్ట్ చేసిన మోటార్ సైకిల్, స్కూటర్ మోడళ్ల రేట్లను కంపెనీ 1.5శాతం వరకు పెంచింది.

ఆగస్టులో టూవీలర్ తయారు దారు సంస్థ మొత్తం 4.89 లక్షల యూనిట్లను విక్రయించగా...అంతకుముందు ఏడాది ఇదే నెలల్లో విక్రయించిన 4.63 లక్షల యూనిట్లతో పోల్చితే ఈనెల పెరుగుదలను సూచించింది. ఇక వాహనాల అమ్మకాల ధరలు దసరా, దీపావళి పండగల సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ పండగ సీజన్లలో సేల్స్ ను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కానీ హీరో మోటోకార్ప్ మాత్రం ధరలను పెంచేసింది. దీంతో ఈ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇది షాక్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు