Sr.NTR Centenary Birth Celebrations, President to release special coin: నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR) జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణేన్ని ముద్రించింది. ఈ కార్యక్రమం ఆగస్ట్ 28న జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఎన్టీఆర్ రూ.100 నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బాలకృష్ణ హాజరు కానున్నారు.
Click here for Invitation
స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఈ ఏడాదికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జయంతిని ఇటీవల నందమూరి కుటుంబం ఘనంగా జరుపుకుంది. ఎన్టీఆర్ గౌరవార్థం ఆయన పేరు మీద 100 రూపాయల నాణెం (NTR coin) విడుదల చేయనున్నట్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ముద్రించిన నాణెం విడుదల వేడుకకు నాయకత్వం వహించనున్నారు. ఆహ్వానితుల్లో నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాకపై క్లారిటీ లేదు. ప్రభుత్వం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం రూ.100 నాణెంను ఎన్టీఆర్ ముఖంతో ముద్రించింది. ఈ నాణెం 44 మిమీ వ్యాసం, 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ కలిగి ఉంటుంది.
నిరాశలో ఫ్యాన్స్
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అన్నదానిపై స్పష్టమైన క్లారిటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కి వెళ్లడం లేదన్న వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఎన్టీఆర్ 100 రూపాయల నాణేల ఆవిష్కరణ వేడుకకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హాజరు కానున్నారనే వార్తలు వచ్చాయి. నందమూరి ఫ్యామిలీ అభిమానులు చాలా సంతోషించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపిస్తారని అభిమానులు ఎంతగానో ఆశించారు. షూటింగ్ కారణంగా జూనియర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చాలా కాలంగా గ్యాప్ నడుస్తోంది. నందమూరి శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. ముందస్తు కార్యక్రమాల వల్ల జూనియర్ దానికి హాజరుకాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేశారు. జూనియర్వి దేశాల్లో తమ జన్మదినవేడుకలు జరుపుకున్నారు. . నందమూరి సుహాసిని తనయుడి వివాహ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. ఇప్పుడు తారక్ ఈవెంట్‌కు వెళ్లకపోవటం నిరాశనే మిగిల్చింది.
Also Read: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత!