హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. By Vijaya Nimma 04 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి రాష్ట్రపతికి హెల్కమ్ విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చారు.బెంగళూరు నుంచి భారత వాయుసేన విమానంలో మంగళవారం ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి.. తెలంగాణ గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతరులు ఘనస్వాగతం పలికారు. సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలకు అనంతరం.. ద్రౌపదిముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. రాష్ట్రపతి నిలయం పరిశీలన, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియం బయల్దేరి వెళ్తారు. అక్కడ సాయంత్రం 4 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి భారత వాయుసేన విమానంలో సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నాగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాష్ట్రపతి రాకకు ముందే విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నవ్వుతూ పలకరించుకున్నారు. పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించుకున్నారు. రాష్ట్రపతి విమానం ల్యాండ్ అయ్యాక ఇద్దరూ కలిసి రన్‌వేపై మాట్లాడుకుంటూ వెళ్లడం కనిపించింది. తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విభేదాలన్నీ పక్కన పెట్టి కేసీఆర్, తమిళిసై ఇద్దరూ రాష్ట్రపతికి స్వాగతం చెప్పడం, ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి