నకిలీ వేలిముద్రలు తయారీ.. ఆరుగురి అరెస్టు

నకిలీ వేలిముద్రలు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితుల నుంచి నకిలీ వేలిముద్రలతో పాటు వాళ్లు కాజేసిన రూ.10లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఆధార్ ఎనేబుల్డ్ సిస్టం ద్వారా వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బు స్వాహా చేసినట్లు గుర్తించారు.

New Update
నకిలీ వేలిముద్రలు తయారీ.. ఆరుగురి అరెస్టు

ఇటీవలే జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రల స్కామ్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోసారి నకిలీ వేలిముద్రల స్కామ్‌ వెలుగులోకి రావడంతో దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్న సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసి నిందితుల నుంచి నకిలీ వేలిముద్రలు తయారుచేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆధార్ ఎనేబుల్డ్ సిస్టం ద్వారా వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బు స్వాహా చేసినట్లు గుర్తించారు. వినియోగదారుల నకిలీ వేలి ముద్రల సేకరణ ద్వారా లక్షల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో పాటు ఇతర వెబ్సైట్ ద్వారా డాక్యుమెంట్లను సేకరించి వాటిలోని వేలిముద్రలను నకిలీవిగా తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also read : ఆ సినిమా వల్లే రెండుసార్లు గుండెపోటు వచ్చింది.. అనురాగ్‌ కశ్యప్‌

ఇదిలావుంటే గతంలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్‌వైజర్లు తయారు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో సూపర్‌వైజర్లుగా ఉన్న సాయినాథ్, నాగరాజులను అరెస్టు చేసినట్లు తూర్పు మండలం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. నకిలీ వేలిముద్రల ద్వారా విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగుల పేరుతో సూపర్‌వైజర్లు నగదు కాజేస్తున్నారని పోలీసులు తెలియజేశారు. అలాగే గతంలోనూ గద్వాల్ లో పోలీసులు నకిలీ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా పక్క సమాచారంతో ఎస్పీ సృజన ఆదేశాలతో గద్వాల డీఎస్పీ రంగస్వామి పర్యవేక్షణలో బుధవారం అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌, ఉండవెల్లి ఎస్సై బాలరాజు అలంపూర్‌చౌరస్తా వద్ద సమావేశమై ఉన్న నకిలీ బీమా పత్రాల సూత్రధారి మీసాల రామస్వామితో పాటు 16 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పలు కంపెనీల పేరిట వినియోగదారులకు నకిలీ బీమా పత్రాలతో పాటు ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఈ నకిలీ వేలిముద్రల ఇష్యూ చర్చనీయాంశమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు