హైదరాబాద్‌లో పంది కొవ్వుతో వంట నూనె తయారీ

నాణ్యత లేని ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
 హైదరాబాద్‌లో పంది కొవ్వుతో వంట నూనె తయారీ

Preparation of cooking oil from pork fat in Hyderabad

రకాల కెమికల్స్

హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పరిధిలోని ఆర్కేపురంలో రమేశ్‌ శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే.. గుట్టు చప్పుడు కాకుండా రమేశ్‌ తన ఇంట్లోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకునే వాడు.. ఆ తర్వాత దాన్ని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఫుడ్ ఆయిల్స్‌ను తయారు చేశాడు. ఇలా తయారు చేసిన నూనెను రోడ్డు పక్కన ఉండే ఫ్రైడ్‌ రైస్‌ దుకాణాల నిర్వాహకులకు తక్కువ రేట్‌ను విక్రయించాడని పోలీసులు తెలిపారు.

ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణదారులపైనా కఠిన చర్యలు

దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రమేశ్‌ ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దీంతో గుట్టుగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న నిందితుడి బండారం మొత్తం బట్టబయలైంది. నిందితుడిని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. పంది కొవ్వు నూనెను కొనుగోలు చేస్తున్న ఫాస్ట్‌ ఫుడ్‌ దుకాణదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు