Premalu OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ప్రేమలు చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.

Film News: శ్రీలీల ప్లేస్ లో ప్రేమలు హీరోయిన్.. స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు..!
New Update

Premalu OTT Release: రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేసిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కంటెంట్ బాగుంటే ఏ భాషలో తెరకెక్కిన సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ మూవీతో మరో సారి రుజువైంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్ప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

Also Read: Vijay Devarakonda – Rashmika: “అవును ఇష్టపడుతున్నాను.. ప్రేమిస్తున్నాను”.. విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై రష్మిక షాకింగ్ కామెంట్స్..!

ప్రేమలు ఓటీటీ రిలీజ్

ఇప్పటివరకు థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం .. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది డిస్నీ హాట్ స్టార్.

Premalu OTT Release

గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాలో నస్లెన్, మమిత, అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్ ఎమ్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ నటనతో అందరినీ ఫిదా చేశారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో నటించిన మమిత బైజూ అందం, అభినయంతో తెలుగు అభిమానుల మనసును దోచేసింది.

Premalu OTT Release

Also Read: Disha Patani: మైనస్‌ డిగ్రీల చలిలో ప్రభాస్‌తో క్యూట్‌ బ్యూటీ రొమాన్స్‌ .. ఇటలీ ఫొటోలు వైరల్!

#hotstar #premalu-ott-release #premalu-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe