/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T192530.789-jpg.webp)
Premalu OTT Release: రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేసిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కంటెంట్ బాగుంటే ఏ భాషలో తెరకెక్కిన సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ మూవీతో మరో సారి రుజువైంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్ప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ప్రేమలు ఓటీటీ రిలీజ్
ఇప్పటివరకు థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం .. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది డిస్నీ హాట్ స్టార్.
గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాలో నస్లెన్, మమిత, అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్ ఎమ్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ నటనతో అందరినీ ఫిదా చేశారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో నటించిన మమిత బైజూ అందం, అభినయంతో తెలుగు అభిమానుల మనసును దోచేసింది.
Here's the official trailer of Premalu!
Starring - Naslen, Mamitha, Althaf Salim, Shyam Mohan M, Akhila Bhargavan, Meenakshi Raveendran, Sangeeth Prathap, Shameer Khan.
Streaming from April 12th exclusively on Disney+ Hotstar!#Premalu #Trailer #PremaluOnHotstar pic.twitter.com/JDrZJ1Gy2Q— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) April 2, 2024