Film News: శ్రీలీల ప్లేస్ లో ప్రేమలు హీరోయిన్.. స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల స్థానంను ప్రేమలు హీరోయిన్ మమితా బైజు బర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ 12వ సినిమాను గౌతం తిన్ననూరితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట శ్రీలీలను అనుకున్నా తాజాగా ఆమె స్థానంలో ఇప్పుడు మమితాను తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Film News: శ్రీలీల ప్లేస్ లో ప్రేమలు హీరోయిన్.. స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు..!
New Update

Sreelela- Mamitha Baiju:  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల అంటే తెలియని వారు ఉండరు. పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించింది.

sreelela (19)అందం, అమాయకత్వంతో పాటు డ్యాన్స్ ను ఇరగదిస్తూ తనకంటే స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

sreelela (11)అయితే, ఈ మధ్య కాలంలో శ్రీలీలకు వరుస ఫ్లాప్ లు పడ్డాయి. ‘స్కంధ’, ‘ఆదికేశవ’, ‘ఎక్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ఇలా అన్ని చిత్రాల్లో నటించి నెలకోసారి థియేటర్ లో సందడి చేయడంతో ఆమె క్రేజ్ తగ్గిపోయింది.

Also Read: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..!

sreelela (26)ఈ చిత్రాలన్ని పెద్దగా  విజయం సక్సెస్ కాలేదు. దీంతో శ్రీలీలకు బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా స్టడీస్ పై ఫొకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, టాలీవుడ్ లో శ్రీలీల స్థానంను ప్రేమలు హీరోయిన్ మమితా బైజు బర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Premalu OTT Releaseహీరో విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత తన 12వ సినిమాను గౌతం తిన్ననూరితో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో మొదట శ్రీలీలను అనుకున్నారు. కాగా ఆమె స్థానంలో ఇప్పుడు మమితా బైజును తీసుకుంటున్నారని తెలుస్తోంది.

publive-image

#mamitha-baiju #sreelela
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి