Mamitha Baiju: బంపరాఫర్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..?

ప్రేమలు చిత్రంతో యూత్ కలల రాణిగా మారింది మళయాళీ బ్యూటీ మమిత బైజూ. అందం, అభినయంతో మెప్పించిన ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తమిళంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసింది ఈ బ్యూటీ. కీర్తిశ్వరన్‌ దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్‌ తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది.

Mamitha Baiju: బంపరాఫర్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..?
New Update

Mamitha Baiju: రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ప్రేమలు’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులతో పాటు .. తెలుగు వారిని కూడా మెప్పించింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజూ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రేమలు చిత్రంతో యూత్ కలల రాణిగా మారింది ఈ మళయాళీ బ్యూటీ.

publive-image

తమిళ్ ప్రాజెక్టు ఓకే చేసిన బ్యూటీ

ప్రేమలు చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక స్టోరీ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్న మమిత సినిమాలు ఓకే చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది ఈ మలయాళ కుట్టి. అయితే తాజాగా తమిళ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ఓకే చేసింది. కీర్తిశ్వరన్‌ దర్శకత్వంలో 'లవ్‌టుడే' ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా ఎంపికైంది.

Also Read: Mamitha Baiju: నయా క్రష్‌.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ? - Rtvlive.com

#premalu-heroine #mamitha-baiju
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe