అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. డోలిలో ఆస్పత్రికి వెళ్తూ గర్భణి మృతి!!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళకి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు డోలీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామం నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లాలంటే 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈక్రమంలో పురిటి నొప్పులు మరికాస్త ఎక్కువై.. మహిళ దారిలోనే మరణించింది.

New Update
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. డోలిలో ఆస్పత్రికి వెళ్తూ గర్భణి మృతి!!

విశాఖ: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు సరైన రోడ్లు, సౌకర్యాలు ఇప్పటికీ లభించడం లేదు. ఇప్పటికీ అక్కడి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే డోలి మోతల కష్టాలు తప్పడం లేదు. వాళ్లు ఏజెన్సీ ప్రాంతాల నుంచి నడుచుకుని వెళ్లే లేపు.. దారిలోనే ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ గర్భిణికి వైద్యం అందక.. మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటన ముంచంగిపుట్టు మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళకి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు డోలీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామం నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లాలంటే 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈక్రమంలో పురిటి నొప్పులు మరికాస్త ఎక్కువై.. మహిళ దారిలోనే మరణించింది.

ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అదే డోలిలో గర్భిణి మృత దేహన్ని గ్రామానికి తరలించారు. కడుపులో బిడ్డతో పాటు మహిళ కూడా మృతి చెదండంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో.. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంతాల వాసులకు సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా ఆస్పత్రులకు వెళ్లడానికి డోలీలను ఆశ్రయిస్తున్నామని.. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని వారు తెలిపారు. అందులోనూ వర్షాకాలంలో అయితే డోలీలలో ఆస్పత్రులకు వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఉబ్బెంగి గ్రామ గిరిజనులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు