Lift : లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు.. ఈ పొరపాట్లు చేస్తే మరింత ప్రమాదం..!

ప్రతిరోజూ ఆఫీస్, మాల్స్ ఇలా పలు ప్రదేశాల్లో లిఫ్ట్ ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్‌ సడన్ గా చెడిపోవడం, లేదా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

Lift : లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు.. ఈ పొరపాట్లు చేస్తే మరింత ప్రమాదం..!
New Update

Malfunction Occurs In Lift : చాలా మంది సాధారణంగా ఎలివేటర్ల(Elevators) ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్ సడన్ గా ఆగిపోవడం, లిఫ్ట్‌లో చిక్కుకోవడం గమనిస్తుంటాము. అలాంటి సమయాల్లో ఒక్కసారిగా భయంగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్ధం కాదు. టెన్షన్ మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం

ఆందోళన వద్దు

లిఫ్ట్‌(Lift) లో ఇరుక్కుపోవడంతో ముందుగా విపరీతమైన భయం, టెన్షన్ మొదలవుతుంది. లిఫ్ట్‌లో ఉన్న వ్యfక్తుల సంఖ్యను బట్టి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అసౌకర్యంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయండి. లిఫ్ట్‌లో ఉన్న ఇతర వ్యక్తులను కూడా ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి.

అలారం మోగించండి

లిఫ్ట్ లోని అలారం బటన్‌ను నొక్కండి. ఎవరైనా ప్రతిస్పందించే వరకు వేచి ఉండండి. కొన్ని బటన్‌లు అలారం బెల్ సింబల్ ను , మరికొన్ని ఫోన్‌ల సింబల్ కలిగి ఉంటాయి. ఒకవేళ ఫోన్ బటన్ నొక్కితే వారికి అర్థమయ్యేలా పరిస్థిని వివరించాలి. మీరు టెన్షన్ పడుతూ అవతలి వారిని టెన్షన్ పెట్టకూడదు.

publive-image

దూకకూడదు

లిఫ్ట్ చెడిపోయినప్పుడు, కొంతమంది భయపడి పైకి క్రిందికి దూకడం ప్రారంభిస్తారు. చాలా మంది అలా చేయడం ద్వారా లిఫ్ట్ మళ్లీ స్టార్ట్ అవుతుందని కూడా అనుకుంటారు. కానీ ఇది లిఫ్ట్ స్టెబిలైజర్ సిస్టమ్‌(Lift Stabilizer System) ను ప్రభావితం చేయవచ్చు. అప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది.

తలుపు తెరవడానికి ప్రయత్నించవద్దు

లిఫ్ట్ లో ఇరుక్కున్నప్పుడు, చాలా మంది తలుపు తెరవడానికి ఆసక్తి చూపడం సహజం. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. లిఫ్ట్ తెరుచుకొని కింద పడే ప్రమాదం(Accident) ఉంటుంది. అందువల్ల, లిఫ్ట్ తలుపును మీరే తెరవడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

Lemon: నిమ్మకాయలు త్వరగా ఎండిపోతున్నాయా..? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి - Rtvlive.com

#lift #elevator #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe