Panjagutta Police Station: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగే తమ పెళ్లి వేడుకను మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని జంటలు ప్లాన్స్ వేస్తారు. తమ జీవితంలో ఎంతో కీలక ఘట్టమైన ఈ పెళ్లి తంతు తరతరాలు గుర్తిండిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో పెళ్లి సెట్ అవ్వడమే ఆలస్యం.. ప్రీవెడ్డింగ్ షూట్ మొదలు.. అప్పగింతలు అయ్యేవరకు ప్రతి కార్యక్రమాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. ప్రస్తుత కాలంలో ఇది కామన్ అయిపోయింది. అయితే, తాజాగా ఓ పోలీస్ జంట తమ వివాహాన్ని వివాదంగా మార్చుకుంది. ఇప్పుడీ అంశమే ప్రధాన చర్చగా నడుస్తోంది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. పోలీస్ వాహనంతో.. అది కూడా ఖాకీ డ్రెస్‌ను ధరించి.. ఇద్దరు పోలీస్ అధికారులు ప్రీవెడ్డింగ్ షూట్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సదరు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ భావనతో ఏఆర్ ఎస్సై కిషోర్ వివాహం జరిగింది. వీరి వివాహం గత నెల ఆగస్టు 26న జరుగగా.. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. అయితే, ఈ షూటింగ్ స్పాటే ఇప్పుడు వివాదాస్పదమైంది. రకరకాల లొకేషన్లలో ప్రీవెడ్డింగ్ షూట్ చేసిన ఈ జంట.. మొదటి షాట్ మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అది ఖాకీ డ్రెస్ ధరించి, పోలీస్ వాహనం ఉపయోగించారు. దాంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు రచ్చ క్రియేట్ చేస్తోంది. ఇద్దరూ సినిమా రేంజ్లో ఖాకీ డ్రెస్‌లో ఫోజులు ఇస్తూ ప్రీవెడ్డింగ్ షూట్లో తళుక్కుమన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సదురు ఎస్సై లు భావన, కిషోర్‌లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రీ వెడ్డింగ్ షూట్‌పై మండిపడుతున్నారు.
Also Read:
Pawan kalyan TDP: పవన్ నిర్ణయంతో జనసేనకు కాపుల ఓట్లు దూరం కానున్నాయా? ప్చ్.. రాంగ్ స్టెప్?