Pravalika Suicide Case: చిక్కడపల్లి ప్రవళిక(Pravalika) ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యువతి ఆత్మహత్యపై ఆమె తల్లి, సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడే నా బిడ్డను టార్చర్ చేశాడు.' అంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ప్రవళిక తల్లి విజయ.. 'నా కొడుకు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకోవద్దని కష్టపడి కోచింగ్ ఇప్పించాం. కానీ ప్రవళికను శివరామ్ ప్రేమ పేరుతో వేధించాడు. నా బిడ్డను శివరామ్ టార్చర్ చేశాడు. ఈ విషయం చెప్పలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. వాడిని కఠినంగా శిక్షించాలి.' అని డిమాండ్ చేశారు. ప్రవళిత సోదరుడు ప్రణయ్ మాట్లాడుతూ.. 'అక్క, నేను అశోక్‌నగర్‌లో చదువుకుంటున్నాం. అక్కను రోజూ కలిసేవాడిని. శివరామ్ అనే వ్యక్తి వేరే అమ్మాయి ద్వారా పరిచయం అయ్యాడు. ఆమెను వేధించేవాడు. ఈ విషయం మాకు చెప్పలేదు. శివరామ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లింది. అందుకే ఆత్మహత్య చేసుకుంది.' అని ప్రవళిక సోదరుడు ప్రణయ్ చెప్పాడు.
ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
శివరామ్ వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయిందని ప్రవళిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రవళిక మృతిపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్‌పై వారు తీవ్రంగా స్పందించారు. బిడ్డ చనిపోయిందన్న బాధలో తామున్నామని, రాజకీయాల కోసం తమను వాడుకోవద్దని కోరారు. కాగా, హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో గతవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు పరీక్షల వాయిదా కారణంగానే ఆమె చనిపోయిందటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?