Telangana: ప్రవళిక ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన తల్లి..
చిక్కడపల్లి ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లి, సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడే నా బిడ్డను టార్చర్ చేశాడు.' అంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేశారు. 'నా కొడుకు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకోవద్దని కష్టపడి కోచింగ్ ఇప్పించాం. కానీ ప్రవళికను శివరామ్ ప్రేమ పేరుతో వేధించాడు. నా బిడ్డను శివరామ్ టార్చర్ చేశాడు. ఈ విషయం చెప్పలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. వాడిని కఠినంగా శిక్షించాలి.' అని డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/03/12/HeLZgSRLhBAxThXRau4x.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pravalika-2-jpg.webp)