Simla: కంగానా పై పోటీకి దిగనున్న నేత ఎవరో తెలుసా!

మండి నుంచి కంగనా రనౌత్‌పై ప్రతిభా సింగ్ పోట చేయటం పై స్పష్టత వచ్చింది. మొదటి పోటిీ పై ఆమె నిరాకరించిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఎవరు ఈ ప్రతిభా సింగ్?

Simla: కంగానా పై పోటీకి దిగనున్న నేత ఎవరో తెలుసా!
New Update

హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ(BJP) అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అదే సమయంలో కాంగ్రెస్(congress) జాబితా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి చూపంతా మండి(MANDI) లోక్‌సభ స్థానం పైనే ఉంది.  మండి లో BJP తరుపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను పోటీకి దిగుతుండటంతో ఇప్పుడు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది .

అయితే గతంలో ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్  నిరాకరించారు.  ఇప్పుడు ఆమె తన మాటలను వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తుంది.  కంగానా పేరు ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌తిభా సింగ్ తాను ఎన్నిక‌ల‌కు పోటీ చేసేందుకు సిద్ధ‌మంటూ కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి సందేశం పంపింది.

ఢిల్లీలో సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత మార్చి 20న మండి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్ నిరాకరించారు.ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ప్రతిభా సింగ్ ఇలా మాట్లాడారు.  కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాను. నేను నిరంతరం ప్రజల మధ్యనే  ఉన్నాను. ఈ పరిస్థితుల్లో మనం విజయం సాధించగలమని నేను అనుకోను. ఎవరైతే అభ్యర్థిని నిర్ణయిస్తారో వారికి సహాయం చేస్తానని చెప్పాను.

ప్రతిభా సింగ్ మండి నుంచి ఆరోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇంతకు ముందు ఆమె ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు గెలిచారు. ఆమె ఇక్కడి నుంచి రెండుసార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించారు. ఆమె దివంగత భర్త వీరభద్ర సింగ్ 1962లో మండి నుంచి మొదటి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు అతని వయస్సు 26 సంవత్సరాలు.
#himachal-pradesh #kangana-ranaut #pratibha-singh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe