/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Prashant-Varma-jpg.webp)
Prasanth Varma: రూమర్స్.. సినీ ఇండస్ట్రీలో ఇవి చాలా కామన్. ఇప్పుడు మరీ ఎక్కువ. అందులోనూ ఒక సినిమా హిట్ అయిందంటే.. అదీ చిన్నసినిమా సూపర్ డూపర్ హిట్ అయినదంటే.. ఇక అర్ధం పర్ధం లేని కథలు అల్లేసి.. ప్రపంచం అంతా గిరగిరా తిప్పేస్తారు. ఇటీవల చిన్న సినిమాగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్ (Hanuman Movie). తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఈ సినిమా నిర్మించారు. తక్కువ బడ్జెట్ లో సూపర్ గ్రాఫిక్స్ తో.. వండర్స్ సృష్టించాడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma). అయితే, ఈ సినిమా విధులకు ముందు పెద్ద రాద్ధాంతం జరిగింది. పండక్కి నాలుగు సినిమాలు ఉండడం.. అందులో మూడు పెద్ద సినిమాలు కావడంతో వాటి మధ్యలో క్రష్ అయిపోతావు.. కొద్దిగా తగ్గు అని హనుమాన్ ఆపే ప్రయత్నాలు జరిగాయి. అయితే, హీరో, దర్శకుడు,నిర్మాత ముగ్గురు తమ సినిమాపై నమ్మకంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ నాలుగు సినిమాలు విడుదలయ్యాకా.. అసలు పెద్ద సినిమా హనుమాన్ అయింది. హనుమాన్ దెబ్బకు పెద్ద పెద్ద రికార్డులు గల్లంతయ్యాయి. ఇంకా ఆ హవా ఎక్కడా తగ్గలేదు. 25 రోజుల్లో 300 కోట్ల కలెక్షన్స్ (Hanuman Collections).. అదీ టికెట్ రేట్స్ ఎక్కడా పెంచకుండా.. మహామహులకే సాధ్యంకాని ఫీట్. దానిని సాధించింది హనుమాన్.
రూమర్స్ కథ
ఇప్పుడు మొదలైంది రూమర్స్ కథ.. కలెక్షన్స్ ఇంతగా వచ్చాయి.. ఇందులో నాకు వాటా ఇవ్వాల్సిందే అని దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాత నిరంజన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాడంటూ వదంతులు ప్రారంభం అయ్యాయి. దాదాపుగా నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే గాసిప్ గాలిలో తిరుగుతూనే ఉంది. అయితే, ఈ రూమర్స్ పై ఇప్పటివరకూ నిర్మాత నిరంజన్ రెడ్డి కానీ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కానీ స్పందించలేదు. కానీ, మౌనం కూడా అంగీకారం అయిపోతుంది కదా.. దాదాపుగా అందరూ వదంతులను నమ్మే పరిస్థితి వస్తోంది. దానికి చిలవలు.. వలువలు తయారు అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ స్పందించాడు. అసలే హనుమాన్ తెలివితేటలు కదా. ఎక్కడా రూమర్స్ ని ప్రస్తావించకుండా.. ఎటువంటి అనుమానం అక్కర్లేకుండా.. అటు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నవారికి.. ఇటు వాటిని నిజం అనుకుంటున్నవారికి ఒక్క ట్వీట్ తో కూల్ గా సమాధానం ఇచ్చేశాడు.
Also Read: అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు!
నిర్మాత నిరంజన్ రెడ్డి తో కలిసి ప్రశాంత్ వర్మ మొబైల్ చూస్తున్నట్టుగా ఉన్న ఫోటో ఒకటి ట్వీట్ (Tweet) చేశాడు. అంతేకాకుండా దానికి “నెగిటివిటీని బ్రౌజ్ చేస్తూ.. నవ్వుకుంటున్నాం.. అన్ బ్రేకబుల్ హనుమాన్ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోతో పాటు వచ్చిన ఈ కాప్షన్ వదంతులకు చెక్ పెట్టినట్టే. తనదైన స్టైల్ లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఈ స్పందనకు అభిమానులు ఫిదా అయిపోయారు. విమర్శలు.. రూమర్స్ వస్తే అరిచి.. కరిచేసే ప్రస్తుత పరిస్థితుల్లో కూల్ గా విమర్శలను ప్రశాంత్ వర్మ (Prashant Varma) భలే తిప్పికొట్టాడు అని అనుకుంటున్నారు. మీరు కూడా ఇక్కడ ప్రశాంత్ వర్మ ట్వీట్ చూడండి..
Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddypic.twitter.com/2O5J6BqwPH
— Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024
Watch this Interesting News :
Follow Us