Vijayawada: భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ప్రమాదం అంచుకు చేరుకుంది. ఇప్పటికే నిండుకుండాల మారిన బ్యారేజ్ లోకి కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజ్ గేట్లకు బలంగా ఢీ కొట్టడంతో గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న ఇరిగేషన్ నిపుణులు కన్నయ్య నాయుడు అక్కడికి చేరకుని పరిశీలించారు. రేపటి నుండే గేట్ల అమరిక పనులను మొదలు పెడతామని, 15 రోజులలోగా గేట్ల అమరిక పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు కూడా గేట్లను పరిశీలించారు.
నిపుణుల సహాయంతో గేట్లను అమర్చుతాం..
ఈ మేరకు విరిగిన గేట్లను పరిశీలించాం. నిపుణుల సహాయంతో గేట్లను అమర్చుతాం. గేట్లు బాగా డ్యామేజ్ అయ్యాయి. గేట్లు కొట్టుకుపోవడానికి కుట్ర కోణంపై కూడా విచారణ చేపడతాం. వైసీపీ నాయకులు హస్తం ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రకాశం బ్యారేజ్ లాంటి ఒక ప్రాజెక్టు మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇరిగేషన్ నిపుణులైన కన్నయ్య నాయుడు సహకారంతో గేట్లను త్వరగానే అమరుచుతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.