Praja Palana : ప్రజాపాలనకు శివ-పార్వతుల దరఖాస్తు!

ప్రజాపాలనలో ఆదిదంపతులు శివ-పార్వతుల పేరుతో దరఖాస్తు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో అభయహస్తంకు దరఖాస్తు చేశారు. అప్లికేషన్ ఫారమ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Praja Palana Application: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా?.. ఒక్క క్లిక్ తో మీ అప్లికేషన్ స్టేటస్.. డైరెక్ట్ లింక్ ఇదే!
New Update

Shiva - Parvathi : తెలంగాణ(Telangana) లో ప్రజాపాలనకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్(Congress) హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ(6 Guarantee) లను అమలు చేసేందుకు ప్రజాపాలన(Praja Palana) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 28నుంచి జనవరి 6వరకూ అప్లికేషన్ ప్రక్రియ నిర్వహించింది. అయితే ప్రజాపాలనలో ఆదిదంపతులు శివ-పార్వతుల(Shiva - Parvathi) పేరుతో దరఖాస్తు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

publive-image

ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి..

ఈ మేరకు ఆసక్తికరమైన సంఘటన హన్మకొండ(Hanumakonda) జిల్లాల్లో చోటుచేసుకుంది. భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో అభయహస్తంకు దరఖాస్తు చేశారు. ఇందులో దరఖాస్తుదారుడి పేరు శివుడి గా, భార్య పేరు పార్వతి దేవిగా, కుమారుల పేర్లు వినాయకుడు, కుమారస్వామిగా రాశాడు. ఇందులో గృహలక్ష్మి, గృహజ్యోతితోపాటు ఇతర పథకాలకు అప్లై చేశాడు.

ఇది కూడా చదవండి : BIG BREAKING : నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

ఫొటోలు వైరల్..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫొటోలు వైరల్ అవుతుండగా.. ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని కించపరిచే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకోసం చేపట్టిన పథకాన్ని అపహాస్యం చేసే విధంగా.. దేవుని పేరును వాడుకోవడం సరికాదని అంటున్నారు. ఇలాంటి చర్యలు ఆకతాయితనంగా కనిపిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల డాటాను ప్రభుత్వం జనవరి 17న ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది.

#congress-6-guarantees #hanumakonda-district #congress-praja-palana #shiva-parvathi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe